బీఆర్ఎస్ ఎంఎల్ఏ కౌశిక్ ఆఫీసుపై బీజేపీ దాడి
x
BJP cadre attacked BRS MLA Padi office

బీఆర్ఎస్ ఎంఎల్ఏ కౌశిక్ ఆఫీసుపై బీజేపీ దాడి

బీజేపీ నేతలు, క్యాడర్ కు ఎంఎల్ఏకి మధ్య పెద్ద గొడవైంది


బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి బీజేపీ నేతలు, క్యాడర్ కు ఎంఎల్ఏకి మధ్య పెద్ద గొడవైంది. గురువారం ఉదయం కరీంనగర్లోని తన పార్టీ ఆఫీసులో పాడి మాట్లాడుతు కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ పై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి-బండికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, బండికి రేవంత్ డబ్బులు పంపిస్తున్నాడని పాడి ఆరోపించాడు. బండి అనవసరంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నోరుపారేసుకుంటున్నాడని అన్నారు. కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని వార్నింగ్ ఇచ్చాడు. కేటీఆర్ పైన బండి ఆరోపణలు చేస్తే తాము కూడా బండిపైన ఆరోపణలు చేస్తామని హెచ్చరించాడు. కేటీఆర్ పైన ఆరోపణలు చేసేంత స్ధాయి బండికి లేదని పాడి తేల్చేశాడు.

ప్రెస్ మీట్లో కేంద్రమంత్రిపైన పాడి నోటికొచ్చిన ఆరోపణలు చేయటంతో బండి మద్దతుదారులకు మండిపోయింది. అందుకనే సడెన్ గా పాడి ఆఫీసుపైన వందలమంది ఒక్కసారిగా దాడిచేశారు. కర్రలు, రాడ్లతో దాడిచేసిన మద్దతుదారులు పాడి ఆపీసును ధ్వంసంచేసేశారు. విషయం తెలుసుకున్న పాడి మద్దతుదారులు కూడా బీఆర్ఎస్ ఆఫీసు దగ్గరకు చేరుకోవటంతో రెండువర్గాల మధ్య పెద్ద గొడవ జరిగింది. వెంటనే పోలీసులు అలర్టయి రెండువైపుల మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు.

బహుశా తనపైన దాడి జరుగుతుందని ముందుగానే పాడి ఊహించినట్లున్నాడు. అందుకనే బండిపైన చేయాల్సిన ఆరోపణలన్నీ చేసి వెంటనే ఆఫీసు నుండి మాయమైపోయాడు. ఎంఎల్ఏ ఇంకా ఆపీసులో ఉన్నాడని అనుకున్న బండి మద్దతుదారులు దాడిచేశారు. అయితే అప్పటికే ఆఫీసు నుండి జారుకున్న ఎంఎల్ఏ సేఫ్ అయిపోయాడు. జరిగిన ఘటనలతో కరీంనగర్ పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగిపోయింది. ఆఫీసులో పాడి లేడని తెలుసుకున్న మద్దతుదారులు పట్టణంలోనే ఉన్న మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆఫీసు మీద కూడా దాడిచేయటంతో అక్కడా ఉద్రిక్తత పెరిగిపోయింది.

నిజానికి ప్రత్యర్దులపైన నోరుపారేసుకోవటం పాడికి ఇదే మొదటిసారి కాదు చివరా కాదు. ఎందుకంటే ఎప్పుడూ ఎవరో ఒకరిపైన పాడి ఏవేవో ఆరోపణలు చేస్తునే ఉంటారు. నిత్యం గొడవలకు సిద్ధంగా ఉండే పాడి ప్రచారంలో ఉండాలన్న వ్యూహంతోనే ప్రత్యర్ధులపై ఆరోపణలు చేస్తుంటాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇపుడు కూడా తనను చంపాలన్న ప్లాన్ తోనే బండి మద్దతుదారులు తన ఆఫీసుపైన దాడి చేశారని మళ్ళీ గోల మొదలుపెట్టాడు. తాను ఎవరినీ ఏమీ అనకున్నా, ఎవరినీ రెచ్చగొట్టక పోయినా తనమీద దాడులు చేయటం అన్యాయం అంటు గోల చేస్తున్నాడు. బండి, రేవంత్ కలిసే తనను చంపటానికి ప్లాన్ చేశారని ఆరోపణలతో పాడి మళ్ళీ రెచ్చిపోయాడు. పాడి, గంగుల, బండి పార్టీ ఆపీసుల మీదకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుదారులు దాడులు చేసుకుంటుండటంతో పట్టణంలో ఉద్రిక్తత పెరిగిపోయింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కరీంనగర్ నుండి పాడిని తీసుకెళ్ళిపోయారు.

Read More
Next Story