x

రేవంత్, కేసీఆర్ ఆస్తులపై పిల్

అక్రమాస్తుల సంపాదన విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల కుటుంబాలు ఆస్తులపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందనరావు పిల్ దాఖలుచేశారు


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కుటుంబం-కేసీఆర్ కుటుంబ ఆస్తుల పంచాయితీలో బీజేపీ దూరింది. ఇద్దరి ఆస్తుల మీద వెంటనే విచారణ జరపాలని కోరుతు బీజేపీ ఎంపీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్) దాఖలు చేశారు. అక్రమాస్తుల సంపాదన విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల కుటుంబాలు ఆస్తులపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందనరావు పిల్ దాఖలుచేశారు.

తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుని లక్షల కోట్లరూపాయలు సంపాదించిందని రేవంత్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తన ఆరోపణలకు మద్దతుగా రేవంత్ కొన్ని పత్రాలు, వివరాలను బయటపెట్టారు. అలాగే రేవంత్ సోదరులు 50 వేల కోట్లరూపాయలు దోచుకున్నారంటు కేటీఆర్ కూడా మీడియా సమావేశాల్లో ఆరోపిస్తు ఆధారలంటు కొన్ని పత్రాలు, వివరాలను విడుదలచేశారు.

ఒకరిపై మరొకరు చేసుకుంటున్న ఆరోపణలు, వాటి తాలూకు ఆధారాలపై బీజేపీ ఎంపీ స్పందించి అవే పత్రాలు, ఆధారాలను తన కేసుకు ఆధారాలుగా హైకోర్టులో ఒక పిల్ దాఖలుచేశారు. పై రెండు కుటుంబాల మధ్య ఆస్తుల పంచాయతీపై తక్షణమే స్పందించి హైకోర్టు విచారణ జరిపించాలని ఎంపీ తన పిల్ లో హైకోర్టును కోరుతు చీఫ్ జస్టిస్ ను కలిసి విజ్ఞప్తిచేశారు.

రేవంత్, కేసీఆర్ కుటుంబాలు తమ ఎన్నికలఅఫిడవిట్లలో చూపిన ఆస్తులకన్నా ఎక్కువుంటే వెంటనే వాటిని గుర్తించాలని కోరారు. గుర్తించి విచారణ జరపటమే కాకుండా వాళ్ళపై కేసులు కూడా నమోదుచేయాలని రఘునందనరావు పిల్ లో కోరారు. అలాగే సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కు కూడా ఎంపీ తన ఫిర్యాదును పంపారు.

Read More
Next Story