విపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ
x
ప్రధాని నరేంద్ర మోదీ

విపక్షాలపై నిప్పులు చెరిగిన మోదీ

‘భారత మహిళల చిరకాల కలని ప్రతి పక్షాలు నలిపివేశాయి’


Click the Play button to hear this message in audio format

"క్షమించమ్మా, చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు చూడాలన్న నీ కల నెరవేర్చలేకపోయాను," అని ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ మహిళా సమాజాన్ని కోరారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, లోక్ సభ, అసెంబ్లీలొో సభ్యుల సంఖ్యను పెచేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు (Nari Shakti Vandan Adhiniyam) లోక్ సభలో ఓడిపోయిన నిన్న ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షలు దీనిని ప్రజాస్వామిక ఘనవిజయంగా చేసుకుంటున్న సంబరాల మధ్య ప్రధాని ఇలా మెలిక పెట్టి క్షమాపణ కోరారు. శనివారం రాత్రి బిల్లు ఓడిపోవడం ప్రతిపక్షాలను విమర్శిస్తూ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ 131వ రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్ సహ ఇతర విపక్షాలు వ్యతిరేకంగా ఓటు వేసి మహిళా లోకానికి ద్రోహం చేశాయని ప్రధాని మోదీ తన నాటకీయ శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సమాజ్ వాది పార్టీ లను పేరు పేరున పేర్కొంటూ విపక్ష పార్టీలన్నీ కలిసి మూకుమ్మడిగా మహిళా బిల్లును ఓడించాయని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం ఈ పార్టీలు చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.

"ఈ బిల్లు ఓడిపోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను. ఈ బిల్లు లోక్ సభ ఆమోదం లభించేందుకు అవసరమయిన 66 శాతం ఓట్లను మేము కూడగట్టలేకపోయివుండవచ్చు, కాని 100 శాతం నారీ శక్తి మాతో ఉంది," అని ప్రధాని అన్నారు. మహిళా రిజర్వేషన్లను అమలుచేసేందుకు ఎదురవుతున్న అడ్డంకులన్నింటిని తాము అధిగమిస్తామని కూడా ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

ఇది భ్రూణ హత్యతో సమానమని మండిపడ్డారు. కాంగ్రెస్ పరాన్న జీవిలా తయారైందని అన్నారు. తాము తీసుకొచ్చే ప్రతి బిల్లును కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ, జన్ ధన్ ఖాతాలు, డిజిటల్ పేమెంట్ లు, ఆర్టికల్ 370, వక్ఫ్ బోర్డు సవరణలు, ట్రిపుల్ తలాక్, రామాలయ నిర్మాణం, సీఏఏ, డీలిమిటేషన్, మహిళా బిల్లులు, కొత్త పార్లమెంట్ నిర్మాణం ఇలా ఏదైన అడ్డుకోవడమే పనిగా పెట్టుకుందని, అసలు సంస్కరణలు తీసుకురాకుండా చూడటమే దాని లక్ష్యమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

"మహిళల కలలను విపక్షాలు మూకుమ్మడిగా ధ్వంసం చేశాయి. కుటుంబ పార్టీలలో మహిళలు తప్ప ఇతర మహిళలు ఎదగడం వారికి ఇష్టం లేదు. మేము చిత్తశుద్దితో బిల్లు తీసుకొచ్చాము. అంతేకాదు, ఈ బిల్లు క్రెడిట్ కూడా తీసుకోమని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశాము. కానీ వాటిని పట్టించుకోలేదు," అని ఆయన అన్నారు.

దేశ ప్రజలను విభజించి లాభం పొందడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని, అదే చేస్తోందని ప్రధాని దుయ్యబట్టారు. బిల్లు ఆమోదం పొందితే అన్ని రాష్ట్రాలు లాభం పొందేవని చెప్పారు. పేదల రిజర్వేషన్లు కల్పించిన కూడా కాంగ్రెస్ వ్యతిరేకత తెలిపిందని విమర్శలు గుప్పించారు.

మహిళా శక్తి బిల్లు ఓడిపోవడంతో మోదీ క్షమాపణలు చెప్పారు. మహిళా బిల్లును అడ్డుకున్న పాపం వారిని వెంటాడుతుందని హెచ్చరించారు. ఆఖరికి ఉగ్రవాదం, నక్సలిజం విషయంలో ఇదే తరహాలో వ్యవహరించిందని చెప్పారు.

సమాజ్ వాదీ పార్టీ లోహియా కలలను తుంగలో తొక్కిందని విమర్శించారు. మహిళా శక్తిని దేశం కావాలనుకుంటోందని, అయితే వారిని పరివార్ పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. ఇప్పుడు తమ శక్తి తక్కువగా ఉందని, కానీ తమ సంకల్పం మాత్రం అజేయంగా ఉన్నాయని తన ప్రసంగాన్ని ముగించారు.

కాంగ్రెస్ ఆక్షేపణ

ప్రధాని ప్రసంగం పక్షపాత వైఖరితో సాగిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

ఒక ప్రధాని జాతిని ఉద్దేశించే చేసే ప్రసంగం నిస్పాక్షింగా తటస్థంగా ఉండాలని, జాతిని సమాయత్తం చేసేందుకు, జాతిలోవిశ్వాసం నింపేదుకు ఉపయోగపడాలని అంటూ నేటి ప్రధాని మోదీ ఉపన్యాసం దీనికి విరుద్ధంగా సాగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ అన్నారు.





Read More
Next Story