కవితను టూత్ పేస్ట్ తో పోల్చిన బీఆర్ఎస్
x

కవితను టూత్ పేస్ట్ తో పోల్చిన బీఆర్ఎస్

కవిత మీదున్న కోపాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోలికతో తీర్చేసుకున్నది


ఒక్కచిన్న పోలికతో కల్వకుంట్ల కవిత మీదున్న అక్కసునంతా బీఆర్ఎస్ తీర్చేసుకుంది. కవిత మీదున్న కోపాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక పోలికతో తీర్చేసుకున్నది. ఇంతకీ విషయం ఏమిటంటే కవిత ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని డూప్లికేట్ పేస్ట్ తో బీఆర్ఎస్ పోల్చింది. ఒరిజినల్ టూత్ పేస్ట్..డూప్లికేట్ టూత్ పేస్ట్ అలాగే ఒరిజినల్ వాటర్ బాటిల్ బిస్లెరికీ డూప్లికేట్ బాటిల్ ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రెండు టూత్ పేస్టులు, రెండు వాటర్ బాటిళ్ళను పోల్చుతు ట్విట్టర్లో బీఆర్ఎస్ పోస్ట్ పెట్టింది.


కవిత ప్రకటించిన టీఆర్ఎస్ అనే పార్టీ కేసీఆర్ ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీకి నకలే అని ఫొటో ద్వారా బీఆర్ఎస్ తేల్చిచెప్పేసింది. నిజంగా కవిత ఏర్పాటుచేసిన పార్టీ టీఆర్ఎస్ కు నకలులాగ ఉందని బీఆర్ఎస్ చెప్పటం కాదు కాని చూసిన వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తోంది. కవిత ఏర్పాటుచేసిన పార్టీ టీఆర్ఎస్ ప్రకటన వినగానే అందరికీ కేసీఆర్ 2001లో పెట్టిన టీఆర్ఎస్సే గుర్తుకొస్తే అది జనాల తప్పు ఎంతమాత్రం కాదు. ఒకవైపు తండ్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న కవిత మళ్ళీ తండ్రి ఎప్పుడో పెట్టిన టీఆర్ఎస్ పార్టీ పేరునే తాను ఎందుకు వాడుకోవాలని అనుకున్నారో అర్ధంకావటంలేదు.


కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి. ఇపుడు కవిత ప్రకటించిన పార్టీ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన. పలికేటపుడు, చెప్పేటప్పుడు రెండింటిని ఎవరైనా టీఆర్ఎస్ అనే అంటారు, అలాగే వినబడుతుంది. మరి రెండింటిలో తేడా ఏముంది ? ఏమీలేదు, తండ్రి పెట్టిన టీఆర్ఎస్ పేరునే తాను కాపీ కొట్టాలని కవిత అనుకున్నారు, కొట్టేశారు. ఇంతోటిదానికి పెద్ద బిల్డప్ ఇస్తున్నారంతే. అందుకనే బీఆర్ఎస్ ట్విట్టర్లో నకిలీ టీఆర్ఎస్ అని పోస్టు పెట్టగానే నెటిజన్లు కూడా కవిత పార్టీ పేరును హేళనచేస్తు పోస్టులు పెడుతున్నారు. ‘చూడటానికి అసలు, నకిలీ ఒకేలాగున్నా తేడా తెలుసుకోలేని అంత అమాయకులు కారు జనాలు’ అని బీఆర్ఎస్ తన ట్విట్టర్ పోస్టుకు క్యాప్షన్ పెట్టడం బాగా వైరల్ అవుతోంది.

Read More
Next Story