x

పూర్తి డిఫెన్సులో పడిపోయిన బీఆర్ఎస్

గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటు వేసే ఈ ఎన్నిక తాజా రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్సులో పడిపోయింది. అది కూడా ఎంఎల్సీ ఎన్నికలకు ముందు. 2027, మార్చిలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ స్ధానాల ఎన్నికల ఓటర్ జాబితా తయారీకి ఎన్నికల కమిషన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్, నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీల పదవీకాలం వచ్చేయేడాది మార్చితో పూర్తవుతుంది.

ఎన్నికలు బహుశా ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటు వేసే ఈ ఎన్నిక తాజా రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగంటే రేవంత్ చెప్పినట్లుగా కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబం సంపాదించిన ఆస్తులు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పరిధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు, మాజీమంత్రులు సంపాదించిన అక్రమాస్తులు ఎక్కువగా నల్గొండ-వరంగల్ జిల్లాల్లో ఉన్నాయి.

తొందరలో జరగబోయే రెండు ఎంఎల్సీ స్ధానాల ఎన్నికలు ఈ ఐదు జిల్లాల పరిధిలోకి వస్తాయి. రాబోయే ఎన్నికల్లో రెండు స్ధానాలను ఎలాగైనా గెలుచుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు భేటీలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమాస్తులు సంపాదించిన వాళ్ళల్లో కొందరిపేర్లను రేవంత్ అసెంబ్లీలో ప్రకటించటంతో చాలామంది నేతలకు షాక్ తగిలినట్లయ్యింది.

దాంతో కేటీఆర్, హరీష్ రావుతో పాటు పై ఐదు జిల్లాల్లోని నేతలు పూర్తిగా డిఫెన్సులో పడిపోయారు. అక్రమాస్తుల అంశం ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయిపోయింది కాబట్టి దీని ప్రభావం రాబోయే ఎన్నికలపై పడుతుందనే ఆందోళన పెరిగిపోతోంది.

Read More
Next Story