ప్రైవేటు ప్రాపర్టీలను కాంగ్రెస్ నేతలు తనిఖీలు చేయచ్చా ?
కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ కెప్టెన్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల తనఖీలు చేయటం వివాదాస్పదమవుతోంది
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న ఫామ్ హౌస్ తనిఖీలు బాగా వివాదాస్పదమవుతున్నాయి. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ మాజీ ఎంఎల్ఏ కెప్టెన్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల తనఖీలు చేయటం వివాదాస్పదమవుతోంది. ప్రైవేటు ప్రాపర్టీల్లోకి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాగ ప్రవేశిస్తారనే ఆరోపణలు విమర్శలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్యనేతల ఫామ్ హౌస్ ల్లో ప్రభుత్వ భూములుంటే అధికారుల తనిఖీల ద్వారా నిర్ధారణ చేసుకుని యాక్షన్ తీసుకోవాలని బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావుతో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్ సూచిస్తున్నారు.
కేసీఆర్, కేటీఆర్, రంజిత్ రెడ్డి ఫామ్ హౌసుల్లో ప్రభుత్వ భూములుంటే ఆ విషయాన్ని నిర్ధారించుకుని వెంటనే నోటీసులిచ్చి విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకి అధికారులు ప్రవేశించకపోయినా కాంగ్రెస్ నేతలు ప్రవేశించేందుకు ప్రయత్నించినపుడు పెద్ద గొడవైంది.
ఇక జన్వాడ గ్రామంలో కేటీఆర్ ఫామ్ హౌస్, మొయినాబాద్ లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లోకి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రవేశించిన విషయం తెలిసిందే. తమ ఫామ్ హౌస్ లోకి కాంగ్రెస్ నేతలు అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు అందటం ఇపుడు సంచలనంగా మారింది.

