‘ఫోర్ వాటర్ కాన్సెప్ట్’ ఒక్కటే ఎల్‌నినోని ఎదుర్కోగలదా ?
x

‘ఫోర్ వాటర్ కాన్సెప్ట్’ ఒక్కటే ఎల్‌నినోని ఎదుర్కోగలదా ?


ఎల్ నినో తీవ్రతపై తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే దీని వల్ల తక్కువ వర్షపాతం నమోదు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కరువు సమస్య తలెత్తే పరిస్థితి ఉంది.తక్కువ వర్షపాతం వల్ల వ్యవసాయ పనులు తగ్గి ఉపాధి కోల్పోవడం, భూగర్భ జలాలు పడిపోవడం, పశుగ్రాసం కొరత వంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాలలో పెరిగిపోతూ ఉన్నాయి.ఈ సమస్యని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 'తెలంగాణ జలసిరి' పేరిట ప్రతి పంచాయతీలో రోజూ కనీసం 60 మందికి ఉపాధి హామీ కల్పిస్తూ, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌లు, ఫామ్ పాండ్స్ వంటి నీటి సంరక్షణ పనులకు రూ.6,311.78 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు ప్రకటించింది.

అయితే, ఈ చర్యలు ఎల్‌నినో ప్రమాదాన్ని పూర్తిగా పరిష్కరించగలవా లేదా అన్న చర్చలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఫామ్ పాండ్స్ ,చెక్ డామ్స్,రీచార్జ్ నిర్మాణాల వల్ల భూగర్భ జలాలు పెరిగి, ఉపాధి లభించడం వల్ల గ్రామీణ ప్రాంతాలు ఈ సమస్య నుండి బయటపడతాయని ప్రభుత్వం చెబుతుంది. అయితే పర్యావరణవేత్తలు మాత్రం ఈ చర్యలేవి కూడా ఎల్ నినో సమస్యకి పరిష్కారం కావని, ఇవన్ని కాంట్రాక్టుల పద్ధతిలో నడుస్తాయని, వీటిలో శాస్త్రీయత ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


దీని గురించి పర్యావరణవేత్త సుబ్బారావు మాట్లాడుతూ,భారతదేశంలో మొదటిసారి హనుమంతరావు అనే ఇంజనీర్ దాదాపు 25 ఏళ్ల క్రితం గొట్టిగారిపల్లెలో ‘ఫోర్ వాటర్ కాన్సెప్ట్’ ని అమలు చేసి,అక్కడ ఎప్పటికి కరువు రాకుండా చేసారని అన్నారు. మన తెలంగాణా సక్సెస్ మోడల్ ని రాజస్థాన్ లో అమలు చేస్తున్నారని,ఇదే మోడల్ తెలంగాణాలోని మిగిలిన ప్రాంతాలకి కూడా విస్తరించాలని అప్పుడే తెలంగాణా కరువు బారిన పడకుండా ఉంటుందని అన్నారు.ఈ ఫోర్ వాటర్ కాన్సెప్ట్ లో గొట్టిగారిపల్లె విజయం సాధించడానికి కారణం దానిలో ప్రజలు కూడా భాగం కావడమని, ఇప్పుడు తెలంగాణాకి కావాల్సింది అలా ప్రజలని భాగం చేసే మోడల్ తప్ప, శాస్త్రీయత లేకుండా కాంట్రాక్టుల మీద నడిచే ఇంకుడుగుంతలు, చెక్ డామ్స్ వంటివి కావని అన్నారు.


Read More
Next Story