కవిత పార్టీకి డిపాజిట్లు కూడా రావా ? (వీడియో)
x

కవిత పార్టీకి డిపాజిట్లు కూడా రావా ? (వీడియో)

కేసీఆర్ బిడ్డ అనితప్ప కవితకు ప్రత్యేకంగా గుర్తింపు ఏమీలేదు అన్నారు


కల్వకుంట్ల కవిత పార్టీకి ఏ ఎన్నికల్లో కూడా కనీసం డిపాజిట్లు కూడా రావని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ జోస్యం చెప్పారు. సోమవారం తెలంగాణ ఫెడరల్ తో ప్రొఫెసర్ మాట్లాడుతు కేసీఆర్ బిడ్డ అనితప్ప కవితకు ప్రత్యేకంగా గుర్తింపు ఏమీలేదు అన్నారు. అధికారంలో ఉన్నపుడు సంపాదించిన డబ్బుతో కొత్తపార్టీ పెట్టినంత మాత్రాన జనాలు ఆధరిస్తారని అనుకునేందుకు లేదు అని అభిప్రాయపడ్డారు. కవిత పార్టీకి టీఆర్ఎస్‌ అనే పేరును కేటాయించటంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు చెప్పటం అంటే అది కేసీఆర్ కు కూడా ఇబ్బందే అని అన్నారు.

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను జనాలు ఆధరించలేదు కాబట్టి మళ్ళీ పార్టీ పేరును మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చాలనే ఆలోచన, డిమాండ్ కారుపార్టీ నేతల నుండి పెరిగిపోతోందనే విషయాన్ని ప్రొఫెసర్ గుర్తుచేశారు. ఇదే విషయాన్ని నాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్లు గతంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పిన విషయాన్ని ప్రొఫెసర్ ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో తనపార్టీకి టీఆర్ఎస్ అనేపేరు దక్కకపోతే కోర్టులో న్యాయపోరాటం సిద్దమని కవిత చేసిన ప్రకటనతో కేసీఆర్‌కు కూడా ఇబ్బందే అన్నారు.

ఒకసారి టీఆర్ఎస్ అనే ఇనిషియల్స్ కోర్టు వివాదంలో చిక్కుకుంటే దాని ప్రభావం బీఆర్ఎస్ పైన కూడా పడుతుంది. అప్పుడు బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ అనుకున్నా కోర్టు వివాదంలో ఉండటం వల్ల ఉపయోగించుకునే అవకాశాలు తక్కువే అని ప్రొఫెసర్ చెప్పారు. టీఆర్ఎస్ అనే పేరు తనకు దక్కనపుడు కేసీఆర్ కు కూడా దక్కకూడదు అనే ఆలోచనలో కవిత ఉన్నారా అన్న అనుమానాన్ని కూరపాటి వెంకటనారాయణ వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్ ఏమిచేస్తుంది ? కవిత స్పందన ఏమిటి ? చివరకు కోర్టు ఏమి తేలుస్తుంది అన్నది సస్పెన్సుగా మారిపోయింది.

Read More
Next Story