మీనాక్షిపై ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు
x

మీనాక్షిపై ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు

ఈ కేసు కారణంగానే మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఎంపిక కావాల్సిన అవకాశాన్ని మీనాక్షి కోల్పోయిన విషయం తెలిసిందే


ప్రజా ప్రతినిధుల కోర్టులో ఒక మహిళ దాఖలుచేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి మీనాక్షి నటరాజన్ పై ఫిర్యాదు నమోదైంది. నారాయణపేట జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కంభం శివకుమార్ రెడ్డి తనను వేధిస్తున్నాడని ఒక మహిళ పంజగుట్టతో పాటు కర్నాటకలోని ఒక పోలీసుస్టేషన్లో కూడా కేసు పెట్టింది. అయితే తర్వాత 2025లో నాంపల్లి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసింది. ఆ కేసులో సదరు మహిళ మొత్తం ఏడుగురు మీద ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు నోటీసులు జారీచేసింది. కోర్టు నుండి నోటీసులు అందుకున్న వారిలో మీనాక్షితో పాటు కుంభం శివకుమార్ రెడ్డి, ఆయన మేనకోడలు నారాయణపేట్ ఎంఎల్ఏ చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, మంత్రి వాకిటిశ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, అభిజయ్ రెడ్డి ఉన్నారు.

ఈ కేసు కారణంగానే మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఎంపిక కావాల్సిన అవకాశాన్ని మీనాక్షి కోల్పోయిన విషయం తెలిసిందే. ఈకేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఈమధ్యనే నాంపల్లి కోర్టు సదరు మహిళ దాఖలుచేసిన కేసును కొట్టేసింది. ఫిర్యాదు తన పరిదిలోకి రాదని ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు దాఖలు చేసుకోవాలని సూచించింది. నాంపల్లి కోర్టు సూచన ప్రకారం సదరు మహిళ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటీషన్ దాఖలుచేసింది. తన పిటీషన్లో సదరు మహిళ మీనాక్షిని మళ్ళీ ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటీషన్ పై కోర్టు తొందరలోనే విచారణ మొదలుపెట్టబోతోంది.

ఇదే విషయమై తెలంగాణ ఫెడరల్ తో బాధిత మహిళ మాట్లాడుతు ‘‘నాంపల్లి కోర్టు నుండి తన ఫైల్ ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయ్యింది’’ అని చెప్పారు. ‘‘శుక్రవారమే తాను ప్రజాప్రతినిధుల కోర్టులో పిటీషన్ వేశాను’’ అని చెప్పారు. ‘‘ఆకోర్టులో ఎంతమంది మీద అయితే ఫిర్యాదుచేశానో ఇపుడు కూడా అంతమంది మీద మళ్ళీ ఫిర్యాదు చేశాను’’ అని తెలిపారు. ‘‘కొత్తగా మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఎంఎల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎంఎల్ఏ వంశీచంద్ రెడ్డి మీద కూడా ఫిర్యాదు చేయబోతున్నాను’’ అని చెప్పారు. తనమీద తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేసినందుకే వెంకట్, వంశీచంద్ మీద ఫిర్యాదు చేయబోతున్నట్లు వివరించారు.

Read More
Next Story