కాంగ్రెస్ కు మహిళలంటే గౌరవం లేదు: కిరణ్ రిజిజు
x
కిరణ్ రిజిజు

కాంగ్రెస్ కు మహిళలంటే గౌరవం లేదు: కిరణ్ రిజిజు

భవిష్యత్ లో మహిళలకు ప్రతిపక్షం సమాధానం చెప్పాల్సి వస్తుందన్న కేంద్రమంత్రి


Click the Play button to hear this message in audio format

మహిళా రిజర్వేషన్ చట్టం లోక్ సభలో వీగిపోవడంతో కాంగ్రెస్ పై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మహిళా వ్యతిరేకమని ఆయన ఆరోపించారు. అది మహిళల "ఆగ్రహాన్ని" ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. "కాంగ్రెస్ మహిళా వ్యతిరేక పార్టీ అని రుజువైంది... అది దేశంలోని మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుంది" అని మంత్రి అన్నారు.

దేశంలోని మహిళలకు దక్కాల్సిన హక్కులు దక్కకపోవడంతో ప్రభుత్వ పక్షం నిరాశకు గురైంది. పార్లమెంట్‌లో ఓటింగ్ ఫలితం తర్వాత కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వం బట్టబయలైందని రిజిజు అన్నారు. బిల్లును ఆమోదింపజేసుకోవడానికి అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని లోక్‌సభలో అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) సాధించలేకపోయింది.
298 మంది సభ్యులు దానికి మద్దతుగా ఓటు వేయగా, 230 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ప్రభుత్వానికి కనీసం 360 ఓట్లు అవసరం. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం, 2029 పార్లమెంటరీ ఎన్నికలకు ముందు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని "ఆచరణలోకి" తీసుకురావడానికి లోక్‌సభ సీట్లను 50 శాతం వరకు పెంచేందుకు వీలు కల్పించిన ఈ రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, దిగువ సభలో అడ్డంకిని ఎదుర్కొంది.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలలో కూడా సీట్లను పెంచాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు బీజేపీ నాయకులు ఈ బిల్లు విఫలమవడంపై నిరాశ వ్యక్తం చేయగా, ప్రతిపక్షాలు మాత్రం ఈ ఫలితాన్ని స్వాగతించాయి. ఇది దేశ భావనను పరిరక్షించడంలో సాయపడిందని పేర్కొంటూ, మహిళా రిజర్వేషన్ల ఆలోచన వెనుక అసలు లక్ష్యం, బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రంలో మరింత ప్రాధాన్యత కల్పించే డీలిమిటేషన్ ప్రక్రియను అమలు చేయడమేనని ఆరోపించాయి.
Read More
Next Story