x

ధక్షిణాదిలో కూడా ఎస్ఐఆర్ ఆందోళనలు

ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది


ఎస్ఐఆర్ వ్యతిరేక ఆందోళనలను ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ ఉన్నారు. ఇందులో భాగంగానే తొందరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 2 లక్షల మందితో భారీ మార్చ్, బహిరంగసభ జరగబోతోంది.

ఈసభకు ఇండియాకూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలంతా హాజరవబోతున్నారు. తేదీ ఇంకా ఫైనల్ కాలదు కాని దసరా పండుగ అయిపోగానే అంటే వచ్చేనెల మొదటి వారంలో బహిరంగసభ ఉండవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఇక రెండోసభ ఎక్కడ నిర్వహించాలన్న విషయం ఇంకా ఖరారు కాలేదు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో భాగస్వామ్యపార్టీలు గడచిన నెలరోజులుగా ఢిల్లీ కేంద్రంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని, దేశవ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల ఓట్లను వెంటనే ఓటర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్లు అందరికీ తెలిసిందే. తెలంగాణలో భారీ బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ ఆదేశించినట్లు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో మాట్లాడి బహిరంగసభ ఎక్కడ నిర్వహించాలి, నిర్వహణ తేదీని ఖరారు చేయబోతున్నట్లు గౌడ్ చెప్పారు.

Read More
Next Story