‘హిల్ట్’ చుట్టూ  పెరిగిపోతున్న వివాదాలు
x

‘హిల్ట్’ చుట్టూ పెరిగిపోతున్న వివాదాలు


కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ) పాలసీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలు, హెచ్చరికలు ఇప్పుడు సరికొత్త వివాదానికి దారి తీశాయి. తాము అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దుచేస్తామని, ప్రభుత్వానికి ఎవరు భూములు వాపసు ఇవ్వవద్దని కేటీఆర్ చేసిన హెచ్చరిక పారిశ్రామికవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.


హిల్ట్ పాలసీ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వ 10 వేల ఎకరాల పారిశ్రామిక భూముల సేకరణ ముసుగులో రు. 5 లక్షల కోట్ల ప్రజల డబ్బుని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది భారీ భూకుంబకోణం అని కేటీఆర్ ఆరోపించారు. అయిత నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటం కోసమే తాము హిల్ట్ పాలసీని తీసుకుని వచ్చినట్లు రేవంత్ పదేపదే చెబుతున్నాడు. జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో 22 పారిశ్రామిక వాడలను ఏర్పాటుచేసి 2800 పరిశ్రమలకు 1960ల్లో ప్రభుత్వం 9,292 ఎకరాలను కేటాయించింది. పారిశ్రామికవాడల చుట్టూ నగరం విస్తరించటంతో ఈ ప్రాంతాలన్నీ ప్రస్తుతం నగరంమధ్యలో ఎంతో ఖరీదైన ప్రాంతాలుగా మారిపోయాయి. అయితే వీటిల్లో కొన్ని పరిశ్రమలు నడుస్తుండగా మరికొన్ని పరిశ్రమలు ఎప్పుడో మూతపడ్డాయి. అప్పట్లో పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో చాలావరకు ప్రస్తుతం నిరుపయోగంగానే ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నడుస్తున్న పరిశ్రమలకు ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల భూములను కేటాయించాలని హిల్ట్ పాలసీలో డిసైడ్ చేసింది. అందుకనే పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం భేటీలు నిర్వహిస్తోంది. ఇక్కడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం బెదిరిస్తోందని, భూములను లాక్కుంటోందనే ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వానికి భూములను ఇవ్వవద్దని పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ సూచించారు. ఈ సూచనే తాజాగా ప్రభుత్వం-బీఆర్ఎస్ మధ్య వివదం పెరిగిపోవటానికి కారణమైంది.

Read More
Next Story