కవితకు ఊహించని షాక్ (వీడియో)
x

కవితకు ఊహించని షాక్ (వీడియో)

పిటీషన్ ను విచారించిన హైకోర్టు కవిత వాదనలను తోసిపుచ్చింది.


కల్వకుంట్ల కవితకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ పేరు విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కవిత ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కవిత ఏర్పాటుచేసిన పార్టీకి తెలంగాణ రక్షణ సేన అనే పేరును కేటాయించటం సాధ్యంకాదు అని కమిషన్ స్పష్టంగా చెప్పింది. టీఆర్ఎస్ అనే సంక్షిప్త పేరుపై తమకు దాదాపు వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చినట్లు కమిషన్ చెప్పారు. అందుకనే పార్టీ పేరుకు ఇంకేవైనా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని కూడా కమిషన్ చెప్పింది. తమ నోటీసు అందిన 15 రోజుల్లోగా సమాధానం రాకపోతే పేరుతో పాటు పార్టీని కూడా తిరస్కరిస్తామని కూడా చెప్పింది.

అయితే కమిషన్ నోటీసుకు కవిత సరైన సమాధానం చెప్పకుండా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రకటించటమే కాకుండా కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తు ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు కవిత వాదనలను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్ విధులు, నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోదని స్పష్టంగా చెప్పేసింది. టీఆర్ఎస్ అనే అక్షరాలతో ఇంతకుముందే రెండుపార్టీలున్నపుడు మళ్ళీ అదే పేరుతో ఇంకో పార్టీ పెడితే కమిషన్ ఎందుకు అనుమతిస్తుంది అని కవిత లాయర్ ను కోర్టు నిలదీసింది.

అందుకనే కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని చెప్పిన కోర్టు తన వాదనను నేరుగా కమిషన్ ను కలిసి వినిపించటానికి వారంరోజులు సమయాన్ని మాత్రం ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా కలుస్తానంటే మాట్లాడేందుకు కమిషన్ కు మాత్రం సమయం ఎక్కడుంటుంది అని కూడా ప్రశ్నించింది. కోర్టు విచారణ సందర్భంగా సంధించిన ప్రశ్నలను బట్టి చూస్తే టీఆర్ఎస్ అనే పేరుతో కవిత పార్టీ పెట్టేందుకు అవకాశాలు దాదాపు లేనట్లే అని అర్ధమవుతోంది.

Read More
Next Story