x

కేసీఆర్ వల్లే సంక్షేమ పథకాలకు బ్రేక్ పడిందా ?

పథకాల అమలును అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వమే చట్టం చేసుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చేదికాదు


ప్రభుత్వం అమలుచేస్తున్న రెండుసంక్షేమపథకాల అమలుపై హైకోర్టు ఇవ్వటం సంచలనంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రెండుపథకాల అమలుకు హైకోర్టు స్టే ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రెండుపథకాలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అప్పటినుండి 2026 వరకు నిర్విరామంగా సాగిన ఈ పథకాల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది.

అసెంబ్లీలో చట్టం చేయకుండా అమలవుతున్న కల్యాణ్ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను వెంటనే నిలిపేయాలని లాయర్ విజయగోపాల్ పిటీషన్ వేశారు. పై రెండు పథకాల్లో గడచిన 12 ఏళ్ళుగా 14.20 లక్షల మంది లబ్దిదారులకు ప్రభుత్వం రు. 12,614 కోట్లు సాయంచేసింది. వివాహం చేసుకోగానే కొత్త పెళ్ళికూతురుకు ప్రభుత్వం రు. 1,00116 బహుమానంగా ఇస్తుంది. దీన్నే కల్యాణ్ లక్ష్మి, షాదీముబారక్ అని ప్రభుత్వం అంటోంది.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన రు. 50 వేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 100,116కి పెంచింది. చట్టసభల్లో చట్టాలు చేయకుండా ఏ ప్రభుత్వం కూడా పథకాలను అమలుచేసేందుకు లేదని, లబ్దిదారుల ఎంపిక, అందించాల్సిన మొత్తాన్ని నిర్ణయించే అధికారం అధికారులకు లేదన్న న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఏ పథకం అమలుచేయాలన్నా చట్టసభలో చర్చించి బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ ఆమోదంతో చట్టం చేయాల్సిందే అన్న లాయర్ వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించింది.

ఇక్కడే కేసీఆర్ చేసిన తప్పు అర్ధమవుతోంది. పథకాల అమలును అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేసీఆర్ ప్రభుత్వమే చట్టం చేసుంటే ఇపుడీ పరిస్ధితి వచ్చేదికాదు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పువల్లే ఇపుడు పథకాల అమలుకు బ్రేక్ పడింది.

Read More
Next Story