‘జిఆర్ఎంబి’ వివాదం …..  ప్రాజెక్టుల విషయంలో  రేవంత్  ఆంధ్రాతో రాజీ పడ్డారా?
x

‘జిఆర్ఎంబి’ వివాదం ….. ప్రాజెక్టుల విషయంలో రేవంత్ ఆంధ్రాతో రాజీ పడ్డారా?


తెలంగాణ నీటి హక్కులకు సంబంధించిన వివాదం పెరుగుతూ ఉంది . తాజాగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొంటూ, తెలంగాణలోని ఏడు కీలక ప్రాజెక్టులను—కాళేశ్వరం, సీతారామ, చిన్న కాళేశ్వరం, చౌటపల్లి హన్మంత్ రావు, చానక-కోరట, మోడికుంట వాగు, మరియు కడెం-గూడెం—నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు (GRMB) ఫిర్యాదు చేసింది.

గోదావరి నదీ యాజమాన్య బోర్డు తన అధికారిక సమావేశ ఎజెండాలో ఈ ఫిర్యాదును చేర్చడంతో ఈ వివాదం రాజేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య గోదావరి నీటి పంపిణీని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ బోర్డే జిఆర్ఎంబి. ఈ ప్రాజెక్టుల విషయమై రేవంత్ రెడ్డి తెలంగాణ తరఫున బలమైన గళాన్ని వినిపించడంలో విఫలమవ్వడమే ఈ వివాదాలకు కారణమైంది.

మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు టి. హరీష్ రావు ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల త్యాగాలతో సాధించుకున్న నీటి హక్కులను పొరుగు రాష్ట్రమైన ఏపీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు కాలరాస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఎంతో కష్టపడి అనుమతులు సాధించి కాళేశ్వరం, సీతారామతో సహా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అనుమతులు తేకపోగా, ఉన్న అనుమతులు కూడా రద్దయ్యే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఎజెండాను ఖరారు చేసే ధైర్యం జిఆర్ ఎం బి కి ఎవరిచ్చారని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

Read More
Next Story