
త్రిష పూజలే విజయ్ కు కలిసొచ్చాయా ?
విజయ్ పార్టీపెట్టి ఎన్నికల్లో పోటీచేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత సహచర నటి త్రిష పైన విపరీతమైన ట్రోలింగ్ మొదలైన విషయం తెలిసిందే
తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ విజయంలో సినీనటి, కొంతకాలంగా తీవ్ర వివాదాస్పదమైన త్రిషా కృష్ణన్ కృషి ఉంది అనే ప్రచారం పెరిగిపోతోంది. విజయ్ పార్టీపెట్టి ఎన్నికల్లో పోటీచేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత సహచర నటి త్రిష పైన విపరీతమైన ట్రోలింగ్ మొదలైన విషయం తెలిసిందే. త్రిష-విజయన్ కు సంబంధాలు అంటగడుతు తమిళనాడులోని బీజేపీ నేతలతో పాటు మరికొందరు ప్రత్యర్ధులు విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేశారు. ఈ నేపధ్యంలోనే విజయ్ భార్య సంగీత విడాకులు కావాలంటు చెంగల్పట్టు కోర్టులో కేసు దాఖలు చేయటం అగ్గికి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇంకేముంది విజయ్-సంగీత దాంపత్యం బీటలువారటానికి త్రిషే కారణమని తమిళనాడులో విపరీతమైన ప్రచారమైంది.
మొదట్లో తమపై జరిగిన ప్రచారాన్ని ఖండించిన త్రిష్ తర్వాత ఆ ప్రచారాన్ని ఏమాత్రం లెక్కచేయలేదు. అలాగే కూడా జరుగుతున్న ప్రచారంపై విజయ్ కూడా ఒక్కటంటే ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సీన్‌కట్ చేస్తే తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ విజయందిశగా దూసుకుపోతోంది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా 117 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటాల్సిందే. తాజా సమాచారం ప్రకారం టీవీకే 110 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమి 75, డీఎంకే కూటమి 49 సీట్లలో మెజారిటితో ఉన్నాయి. ఫైనల్ ఫలితాల్లో కూడా దాదాపు ఇదే ట్రెండ్ కంటిన్యు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఒకవేళ హంగ్ వచ్చినా కింగ్ మాత్రం విజయే అన్న విషయం అర్ధమవుతోంది.
యావత్ తమిళనాడంతా ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ త్రిష మాత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో కనిపించింది. జన్మదినం రోజున స్వామివారిని దర్శించుకోవటం తనకు అలవాటని చెప్పారు. అలాగే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత విజయ్ పార్టీ గెలుపుకోసం త్రిష ప్రత్యేకంగా కొందరు స్వాములను కలిసిందని ప్రత్యేక పూజలు చేసిందని విపరీతమైన ప్రచారం జరిగింది. ఒకవైపు రాజకీయంగా ఒత్తిళ్ళు, మరోవైపు కుటుంబపరమైన సమస్యలు వెరసి విజయ్ ను కొంతకాలంపాటు మనశ్శాంతిలేకుండా చేశాయనటంలో సందేహంలేదు. ఆ సమయంలో విజయ్ కు మద్దతుగా త్రిష మాత్రమే నిలబడింది. విజయ్ గెలుపుకోసం త్రిష చేయించిన ప్రత్యేక పూజలు, ఆచరించిన నియమాలు తదితరాల వల్లే విజయ్ పార్టీ గెలుపుకు దగ్గరైందనే ప్రచారం పెరిగిపోతోంది.

