‘సర్’ పై వివాదాలు పెరిగిపోతున్నాయా ?  (వీడియో)
x

‘సర్’ పై వివాదాలు పెరిగిపోతున్నాయా ? (వీడియో)

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఫారాల అందచేత 40 శాతమే అయ్యిందని రాజకీయపార్టీలు ఆరోపిస్తున్నాయి


జూన్ 25వ తేదీన మొదలైన సర్ ప్రక్రియపై రోజురోజుకు వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందించటం 99 శాతం పూర్తయిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే కమిషన్ ప్రకటించినట్లుగా 99 శాతం ఫారాల పంపిణీ జరగలేదని చాలా ప్రాంతాల్లో కేవలం 45శాతం మందికి మాత్రమే ఫారాలు అందినట్లు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఫారాల అందచేత 40 శాతమే అయ్యిందని రాజకీయపార్టీలు ఆరోపిస్తున్నాయి.

పై జిల్లాల్లోని చాలామంది ఇళ్ళకు బీఎల్వోల బృందాలు వెళ్ళలేదని, ఫారాలు జారీచేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఎల్వో బృందాలు ఎక్కడో ఒకచోట కూర్చుని ఓటర్లకు ఫోన్లుచేసి వచ్చి ఫారాలు తీసుకెళ్ళమని చెబుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషనర్ సుదర్శనరెడ్డికి ఫిర్యాదు కూడా చేశాయి. ఫారాలు నింపే విషయంలో చాలామంది ఓటర్లు అయోమయానికి గురి అవుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఏ విషయంలో కూడా కమిషన్ నుండి క్లారిటి రాకపోవటంతో జనాల్లో సర్ పై అయోమయం పెరిగిపోతోంది. పని ఒత్తిడి తట్టుకోలేక ఒక బీఎల్వో గద్వాల జోగులాంబ జిల్లాలో ఆత్మహత్యకు ప్రయత్నించి ఆసుపత్రిలో చికిత్స్ పొందుతున్నారు. అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న షాహిదాబేగం బీఎల్వోగా సాననూలు గ్రామంతో పాటు అనుబంద గ్రామం దువాసుపల్లిలో సర్ ప్రక్రియను చూస్తున్నారు. అయితే ఇటు అంగన్వాడీ టీచర్ పనితో పాటు అటు బీఎల్వో బాధ్యతల నిర్వహించాలని రెండు విభాగాల అధికారులు ప్రతిరోజు ఒత్తిడి పెడుతుండటంతో తట్టుకోలేక ఆత్మహత్యా యత్నంచేయటం సంచలనంగా మారింది.

Read More
Next Story