22 ఏ సమస్యను మళ్ళీ రేవంత్ దాటవేసారా?
x

'22 ఏ' సమస్యను మళ్ళీ రేవంత్ దాటవేసారా?


ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి '22ఏ 'గురించి ఈ సారైనా స్పష్టత ఇస్తూ ,పరిష్కారం సుచిస్తారా అన్న ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ సమస్య గురించి మాట్లాడారు. కానీ ఆయన ఈ సమస్య రావడానికి గల చారిత్రక కారణాలను నాలుగు దశలుగా విభజించి మాట్లాడారే తప్ప, దీని పరిష్కారాల గురించి ఎక్కడా చర్చించకపోవడం గమనార్హం.

నిజాం కాలం నుండి పరిస్థితులను అర్థం చేసుకుంటే తప్ప, ఈ సమస్య అర్థం కాదని అన్నారు. దీని గురించి నిజాం కాలం నుండి ఎలా సమస్య ఉత్పన్నం అయ్యిందో ,అలాగే స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఆ సమస్య ఎలా కొనసాగిందో చెబుతూ ఇప్పటివరకూ ఉన్న సమస్యల గురించి ప్రస్తావించారు.

అయితే ఆంధ్రాలో పరిస్థితి భిన్నమని అక్కడ బ్రిటిష్ పాలన ఉంది కనుక వాళ్ళు పక్కాగా శిస్తు వసూలు కోసం అన్ని రికార్డులు నిర్వహించారని ఇక్కడ పరిస్థితి వేరని అన్నారు. మొత్తానికి ఈ విషయం మీద మాట్లాడుతూ,చరిత్ర అంత చెప్పి కూడా పరిష్కారం ఏంటి అనేది స్పష్టం చేయకపోవడం గమనార్హం.


Read More
Next Story