x

మంత్రివర్గంలో రేవంత్ పరిస్ధితి ఇలాగైపోయిందా ?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ తదితరుల అవినీతి మీద రేవంత్ తప్ప క్యాబినెట్ మంత్రుల్లో ఒక్కళ్ళు కూడా నోరిప్పటంలేదు.


క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అండ్ బ్రదర్స్ వేలాది కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని బీఆర్ఎస్ క్యాంపు ప్రతిరోజు ఆరోపణలతో రెచ్చిపోతోంది. మీడియా, సోషల్ మీడియాలో బాగా పట్టున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, నేతలు రేవంత్ పై అన్నీ కోణాల్లో రెచ్చిపోతున్నారు.

వాళ్ళకు ధీటుగా రేవంత్ కూడా గట్టిగానే బదులిస్తున్నాడు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ తదితరుల అవినీతి మీద రేవంత్ తప్ప క్యాబినెట్ మంత్రుల్లో ఒక్కళ్ళు కూడా నోరిప్పటంలేదు. రేవంత్ మీద బీఆర్ఎస్ క్యాంపు ఆరోపణలతో విరుచుకుపడుతుంటే ఒక్కమంత్రి కూడా సీఎంకు మద్దతుగా మాట్లాడటంలేదు.

మంత్రివర్గంలో సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, రాజనర్సింహ లాంటి వాళ్ళు ఉన్నా స్పందించటంలేదు. అలాగే మొదటిసారి మంత్రులైన అడ్లూరి లక్ష్మణ్, అజహరుద్దీన్, శ్రీహరి లాంటి వాళ్ళు కూడా మాట్లాడటంలేదు. రేవంత్ కు అత్యంత సన్నిహితురాలు, స్ట్రాంగ్ సపోర్టర్ అయిన మంత్రి సీతక్క కూడా మౌనంగా ఉండటమే ఆశ్చర్యంగా ఉంది. జరుగుతున్నది చూస్తుంటే మంత్రివర్గంలో రేవంత్ ఒంటరి అయిపోయాడా అనే సందేహం పెరిగిపోతోంది.

Read More
Next Story