
రేవంత్ సత్తా ఏమిటో తేలిపోయిందా ? (వీడియో)
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రూపంలో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది అన్నాడు
పార్టీ ప్రజా ప్రతినిధుల భేటీలో చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సత్తా ఏమిటో తేలిపోయిందా ? వ్యాఖ్యలు విన్నవారికి అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టుపైన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రూపంలో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతోంది అన్నాడు. ప్రాజెక్టు కూలిపోవటానికి కారకులను ఉరితీయాలని జనాలందరు కోరుకుంటున్నా నిబంధనలు అడ్డుపడతాయి కాబట్టి ఆపని చేయలేకపోతున్నట్లు చెప్పాడు.
పై వ్యాఖ్యల్లో రేవంత్ అసక్తతే ఎక్కువగా హైలైట్ అయ్యింది. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్లరూపాయల అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. అవినీతికి బాధ్యులు ఎవరో కూడా జనాలందరికీ తెలుసు. అయినా బాధ్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవటం ఏమిటి ? అన్నదే ఇక్కడ పాయింట్. కాళేశ్వరం అవినీతిపైన విచారించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్ర హోంశాఖకు పంపి దాదాపు ఏడాది అవుతున్నా ఇప్పటివరకు ఢిల్లీలో ఎలాంటి కదలికాలేదు. ఈ విషయాన్ని కూడా రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా గుర్తుచేశారు. అందుకనే తనలో ఒకవైపు బాధ మరోవైపు కోపం రగిలిపోతోందన్నాడు.
తనలోని బాధ, కోపం ఎంతున్నా అవినీతికి పాల్పడిన వారిని తాను ఏమి చేయలేకపోతున్నాను అని రేవంత్ తనంత తానే అంగీకరించినట్లయ్యింది. ఒక్క కాళేశ్వరమే కాదు టెలిఫోన్ ట్యాపింగ్ నిందితులను, ఫార్ములా కార్ కేసులో అవినీతికి పాల్పడిన వారిని కూడా 30 నెలలు పాలనను పూర్తిచేసుకున్న రేవంత్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్న విషయం జనాలందరికీ అర్ధమైంది.

