x

అధిష్ఠానం రేవంత్ చేతులు కట్టేసిందా ?

రెచ్చిపోతుండటానికి కారణం ఏమిటంటే తమమీద ఎవరూ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేరన్న ధీమానే కనబడుతోంది.


కాంగ్రెస్‌లోని కొందరు ప్రజాప్రతినిదుల వ్యవహారం చూస్తుంటే చాలామందికి ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండాసురేఖ కాకుండా మరికొంతమంది ఎంఎల్ఏలు కూడా రెచ్చిపోతున్నారు. మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, జడ్చర్ల ఎంఎల్ఏ జానంపల్లి అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంఎల్ఏ యెన్నం శ్రీనివాసులరెడ్డి, నకిరేకల్ ఎంఎల్ఏ మందుల సామేల్, వనపర్తి మాజీ ఎంఎల్ఏ, ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ జిన్నారెడ్డి లాంటి మరికొందరు కూడా రేవంత్ పైన పదేపదే ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రేవంత్ కు వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ ఇప్పటివరకు ఒక్కమాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయితే, మంత్రి కూతురు కొండా సుస్మిత మాత్రం పదేపదే రేవంత్ ను టార్గెట్ చేస్తున్నది. ఇపుడు ఈ అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో హాట్ టాపిక్ అయిపోయింది.

ఇంతమంది రేవంత్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతుండటానికి కారణం ఏమిటంటే తమమీద ఎవరూ క్రమశిక్షణా చర్యలు తీసుకోలేరన్న ధీమానే కనబడుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కావటంతో ప్రజాస్వామ్యం చాలాఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అపరిమితమైన స్వేచ్చ, ప్రజాస్వామ్యమే పార్టీకి సమస్యలు తెస్తున్నది. తనకు వ్యతిరేకంగా రెచ్చిపోతున్న మంత్రి లేదా ఎంఎల్ఏల మీద యాక్షన్ తీసుకోవాలని రేవంత్ అనుకున్నా సాధ్యంకాదు. ఎందుకంటే ఎంఎల్ఏల మీద యాక్షన్ తీసుకోవాలంటే ఏఐసీసీ అనుమతి కావాల్సిందే. రేవంత్ లేదా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఎంఎల్ఏల మీద యాక్షన్ తీసుకునే అధికారంలేదు. ఎంఎల్ఏల మీదే యాక్షన్ తీసుకోలేని రేవంత్, పీసీసీ అధ్యక్షుడు ఇక మంత్రి మీద ఏమి యాక్షన్ తీసుకోలరు ?

కాంగ్రెస్ లో మొదటినుండి ఉన్న పద్దతి ఏమిటంటే ముఖ్యమంత్రికో లేదా పీసీసీ అధ్యక్షుడికో అధిష్ఠానం సర్వాధికారాలు కట్టబెట్టదు. వీళ్ళకు ప్యారలల్ గా సీనియర్ నేతలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి సీఎం లేదా పీసీసీ అధ్యక్షుడు ఎవరిమీదైనా యాక్షన్ తీసుకోవాలంటే వెంటనే సాధ్యంకాదు. ఈ విషయాలు అందరికీ బాగా తెలుసు కాబట్టే కొందరు ఎంఎల్ఏలు తనకు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నా రేవంత్ చూస్తు ఊరుకోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాడు.

Read More
Next Story