ప్రధాని పర్యటన అడ్డుకోడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయా ?
x

ప్రధాని పర్యటన అడ్డుకోడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయా ?

హన్మంతరావు దీక్షకు కేసీఆర్ పార్టీ సపోర్ట్ ..


జనాభా గణనలో కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ బీసీ నేత, కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు వి. హన్మంత రావు చేపట్టిన నిరాహార దీక్ష ఆదివారం రెండో రోజుకు చేరుకుంది. ప్రధాని మోదీ తెలంగాణలో ఆదివారం అడుగుపెడుతున్న నేపథ్యంలో హన్మంత రావు దీక్ష ప్రాధాన్యం చోటు చేసుకుంది. ప్రత్యేక తెలగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి , కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం , కాంగ్రెస్ నాయకులు బసవరాజు సారయ్య , బీసీ నాయకులు పలువురు హన్మంతరావుకు సంఘీభావం తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తెలంగాణాకు రావడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ హన్మంతరావు దీక్షకి మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. బీజేపీ బీటీమ్ అని ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ బీసీ నేతకు మద్దత్తు ఇవ్వడం ఏమిటని రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రత్యేక తెలంగాణలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలో రావడానికి జనాభా గణనలో కుల గణన తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ తొలుత నుంచి ఆరోపిస్తుంది. అన్ని పార్టీల నేతలు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అప్పాయింట్మెంట్ కోరారు. అయితే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వక పోవడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. కుల గణన చేయడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది.

బీసీ వర్గానికి చెందిన మోదీ తెలంగాణలో పర్యటించడం కాంగ్రెస్ పార్టీ‌తో బాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ‌కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారం‌లో రావాలని చూస్తుంది. ఆదివారం రూ. 9వేల కోట్లలో ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు."తెలంగాణా ప్రజల ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు , రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్ చెప్పారు. వచ్చేది మా ప్రభుత్వమే"అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ బీజేపీ ప్రాబల్యం పెరిగిపోతుందోనన్న భయం‌తో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశం మేరకు హన్మంత రావు నిరాహార దీక్షకు హైదరాబాద్ పెద్ద అంబర్ పేటలోని తన నివాసంలోనే దీక్ష చేపట్టారు. మోదీ పర్యటన రోజు హన్మంతరావు దీక్ష చేపట్టడం తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీని ఇరుకున పెట్టడానికి హన్మంత రావు ఈ దీక్ష చేపట్టినట్టు తెలుస్తుంది. బీసీలకు కుల గణన, రిజర్వేషన్ ఇచ్చే విషయంలో స్పష్టత వచ్చే వరకు ప్రధానిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని బీసీ సంఘాలు చేస్తున్న హెచ్చరికను తెలంగాణ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ అభ్యంతరం తెలిపారు. కుల గణన, రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ‌లను మోసం చేశాయని ఆయన ఫెడరల్ తెలంగాణతో అన్నారు. ప్రధాని మతం పేరుతో బీసీలకు రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించడం శోచనీయమన్నారు. రిజర్వేషన్ విషయంలో తెలంగాణా ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మహిళా రిజర్వేషన్ అడ్డుకుంది కాంగ్రెస్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువకాలం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. బీసీ సమాజానికి సంబంధించిన 10 ప్రశ్నలు బీసీ సంఘాలు లేవనెత్తడం విచారకరమని ఆనంద్ గౌడ్ అన్నారు.

కామారెడ్డి డిక్లరేషన్ ఏమిటి ?

గత ఎన్నికల ముందు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ తెలంగాణా కామారెడ్డిలో ప్రకటించింది. వెనుకబడిన తరగతుల సాధికారత కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు కూడా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కుల గణన, బీసీ డిక్లరేషన్ అధికారంలో వచ్చిన 6 నెలల్లో చేపట్టనున్నట్టు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వెల్లడించింది. స్థానికసంస్థల్లో 23 శాతం ఉన్న రిజర్వేషన్ 42 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. బీసీ కమిషన్ నివేదికను అమలు పరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఈ డిక్లరేషన్లో పేర్కొంది. ఆ పార్టీ అధికారంలో వచ్చి అప్పుడే రెండున్నరేళ్ళు గడిచి పోయింది. ఇంతవరకు ఎందుకు అమల చేయడం లేదని బీజేపీ ప్రశ్నిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా అదే ప్రశ్న వేస్తుంది."కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలను టార్గెట్ చేస్తూ ప్రధాని పర్యటన సాగుతుంది" అని రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మోహన్ రావు అభిప్రాయ‌పడ్డారు."ప్రధాని పర్యటన అడ్డుకునే ఉద్దేశం తమ పార్టీకి లేదు " అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. నిరంజన్ అన్నారు. ప్రధాని పర్యటన అడ్డుకోవడానికి కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ ఒక్కటై బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి.

Read More
Next Story