x

ఈడీ, ఐటి ట్రైబ్యునల్లోని భూములకు రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది ?

కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ భూముల్లో అక్రమాలు బయటపడ్డాయి.


ఇపుడీ విషయంపైనే అందరిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ భూముల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అక్రమాలు రెండు. అవేమిటంటే మొదటిది ఫిరంగి నాలాను ఆక్రమించి ఫామ్ హౌస్ లో విలాసవంతమైన భవనాలు నిర్మించారని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ ధృవీకీరించారు.

ఇక రెండోది ఏమిటంటే ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసుల పరిధిలో ఉండటమే కాకుండా ఇన్ కమ్ ట్యాక్స్ ట్రిబ్యునల్లో కేసు ఎదుర్కొంటున్న 13 ఎకరాలు బయటకు ఎలాగ రిలీజ్ అయ్యిందన్నది మిస్టరీగా మారింది. 13 ఎకరాల ఫామ్ హౌస్ లోనే కేటీఆర్ సంవత్సరాలుగా ఉంటున్నారు. ఈ 13 ఎకరాల్లోనే కేటీఆర్ భార్య శైలిమకు 3.8 ఎకరాలు, అత్త పాకాల శశిరేఖకు 18 గుంటల భూమి ఉందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

సత్యం రామలింగరాజు కంపెనీకి చెందిన ఈ 13 ఎకరాలు శతభిష ఆగ్రోటెక్ కంపెనీ ఓనర్ రాజేష్ కు బదిలీ అయ్యింది. రాజేష్ నుండి కేటీఆర్‌కు బినామీగా ప్రచారంలో ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్ రెడ్డి చేతికి వచ్చింది. ప్రదీప్ రెడ్డి సొంతమైన ఫామ్ హౌస్‌లోనే ఏళ్ళతరబడి కేటీఆర్ ఉంటున్నారు. ఈడీ విచారణలో ఉంటు, ఐటి ట్రైబ్యునల్ పరిధిలోని 13 ఎకరాలు బయటకు రిలీజ్ అయ్యాయంటే కేంద్రప్రభుత్వంలోని పెద్దల జోక్యం లేకుండానే జరుగుతుందా ?

ఈడీ, ఐటి శాఖలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి కాబట్టి కేంద్రంలోని పెద్దలకు తెలియకుండా పై భూములు బయటకు వచ్చే అవకాశంలేదు. ఈ విషయాలమీద రేవంత్ ప్రభుత్వం విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోగలదా ? అన్నదే ఇపుడు అందరిలోను పెరిగిపోతున్న అనుమానాలు.

Read More
Next Story