x

సింగరేణిని నిర్లక్ష్యం చేస్తే బీజేపీకి డిపాజిట్లు కూడా రావు

సింగరేణి అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జోస్యం.


సింగరేణి అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జోస్యం. సింగరేణిని ప్రోత్సహిస్తే రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్ను ఆదాయం వస్తుంది. అలాగే వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి కూడా దొరుకుతుంది. సత్తుపల్లి, కోయగూడెం, శ్రావణపల్లి గనులను సింగరేణికి నామినేషన్ మీద కేటాయించాలని డిమాండ్.

ఈ గనులు సింగరేణికి తప్ప మరే ఇతర సంస్ధలకు ఇచ్చే అవకాశం లేదు, ఇచ్చినా బొగ్గు తవ్వకాలు జరిగే అవకాశంలేదు. కోయగూడెం 1/70 చట్టం పరిధిలో ఉంది కాబట్టి చేస్తే గిరిజన సంఘాలు చేసుకోవాలి లేదా ప్రభుత్వ రంగ సంస్ధ సింగరేణి కాలరీస్ మాత్రమే తవ్వకాలు జరపాలి. సత్తుపల్లి, శ్రావణపల్లి గనుల్లో తవ్వకాలు జరిపినా ఓవర్ బర్డన్ రూపంలో వచ్చే టన్నుల కొద్ది మట్టిని బయట పారబోయటానికి ప్రైవేటు సంస్ధలకు భూమిలేదు.

ఈరెండు కారణాలవల్లే మూడుగనులు సంవత్సరాలతరబడి నిరుపయోగంగా ఉండిపోవటానికి కేంద్రప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్ రెడ్డే ప్రధాన కారణమని మండిపాటు. తెలంగాణ కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు ఎంపీల వల్ల సింగరేణికి ఎలాంటి ఉపయోగంలేదని ఆరోపణ. పై మూడుగనులను నామినేషన్ మీద సింగరేణికి ఇప్పిస్తే బీజేపీతో పాటు కిషన్ కు పాలాభిషేకం చేయటానికి సిద్ధం.

సింగరేణి పరిధిలోని 4పార్లమెంటు, 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉద్యోగులు, కుటుంబసభ్యుల ఓట్లు సుమారు 30 లక్షలు ఉంటాయి. సింగరేణిని నిర్లక్ష్యం చేస్తున్న ఫలితం రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తప్పక అనుభవిస్తుంది. పై మూడు గనుల్లో సుమారు 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు నిపుణుల నివేదికలో స్పష్టమైంది.

Read More
Next Story