కొండ సురేఖ బర్తరఫ్ ... ఇక క్యాస్ట్ కార్డే శరణ్యమా?
x

కొండ సురేఖ బర్తరఫ్ ... ఇక 'క్యాస్ట్ కార్డే' శరణ్యమా?


కొండ సురేఖ ని బర్తరఫ్ చేసారు. ఈ విషయంలో కొండ సురేఖ క్యాస్ట్ కార్డ్ ని తన తదుపరి అస్త్రంగా మార్చుకోబోతున్నారు అన్న చర్చ పెరిగిపోతూ ఉంది.ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో భేటీ అయిన తర్వాత సురేఖ మీడియాతో మాట్లాడుతు బీసీ మహిళకు అన్యాయం చేస్తారా అని పార్టీ పెద్దలను అడగటం ఆశ్చర్యంగా ఉంది. తన భర్త మున్నూరుకాపు, తాను పద్మశాలిని అని సురేఖ చెప్పటమే విచిత్రంగా ఉంది. తనను మంత్రివర్గంలో నుండి తప్పిస్తే బీసీ నేతకు అన్యాయం చేశారు అని పార్టీపై విరుచుకుపడటానికి సురేఖ రంగం సిద్ధం చేసుకున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన నియోజకవర్గంలో బీసీల జనాభా 16 శాతం ఉన్నారని మంత్రి చెప్పటమే ఇందుకు నిదర్శనం.

నిజానికి కొండా సురేఖ తననియోజవర్గం వరంగల్ తూర్పులో తిరుగులేని నేత అనే ఇమేజ్ ఏమీలేదు. పరకాలలో గెలిచిన సందర్భాలున్నట్లే ఓడిన ఎన్నికలు కూడా ఉన్నాయి. జడ్పీటీసీ గెలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సురేఖ తొందరగానే ఎదిగారు. అయితే తన నోటి దురుసుతోనే అందరినీ శతృవులను చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలామంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో కూడా సురేఖకు ఏమాత్రం పడదన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన కూతురు చేసిన ఆరోపణలు, విమర్శలు బాగా రాజుకుని ఆమె బర్తరఫ్ కి దారి తీసింది.

ప్పుడు కూడా తన కూతురు సుస్మిత పటేల్ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలతో తనకు సంబంధంలేదని సమర్ధించుకుంటున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.


Read More
Next Story