
జగిత్యాలలో జీవన్ రెడ్డికి పెద్ద ప్రిస్టేజ్ గా మారిపోయిందా ?
మొత్తం బాధ్యత జీవన్ రెడ్డి మీద మాత్రమే ఉంచితే సభవిఫలమైతే తర్వాత పరిణామాలు చాలా ఇబ్బందిగా మారుతాయని కేటీఆర్ అనుమానించినట్లున్నారు
ఈనెల 20వ తేదీన జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో జరగబోయే బహిరంగసభ ఇటు జీవన్ రెడ్డితో పాటు అటు బీఆర్ఎస్ కు బాగా ప్రిస్టేజ్ సమస్యగా మారిపోయింది. ఆశించినస్ధాయిలో జనాలు రాకపోతే జీవన్ తో పాటు పార్టీ పరువు కూడా పోవటం ఖాయం. అందుకనే సభ ఏర్పాట్లు, జనసమీకరణ తదితర విషయాలను ఒక్క జీవన్ రెడ్డి మీదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వదిలేయకుండా పార్టీతరపున కూడా కొందరు ఇన్చార్జులను నియమించారు. జగిత్యాల నియోజకవర్గానికి ఎంఎల్ఏ పల్లా రాజేశ్వరరెడ్డి, కోరుట్లకు ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎంఎల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, వేములవాడకు మాజీ ఎంఎల్ఏ బాల్కసుమన్, చొప్పదండి నియోజకవర్గానికి మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మొత్తం బాధ్యత జీవన్ రెడ్డి మీద మాత్రమే ఉంచితే సభవిఫలమైతే తర్వాత పరిణామాలు చాలా ఇబ్బందిగా మారుతాయన్న అనుమానించినట్లున్నారు కేటీఆర్. అందుకనే బహిరంగసభను ఇంత ప్రిస్టేజ్ గా తీసుకున్నారు.
అలాగే సభ ఏర్పాట్లు, వేదిక ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలు గాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించబోతున్నారు. ఇన్చార్జులు, సీనియర్ నేతలంతా సమన్వయంతో పనిచేసి బహిరంగసభను విజయవంతం చేయాలని కేటీఆర్ అందరినీ ఆదేశించారు. 20వ తేదీ బహిరంగసభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతున్నారు. అందుకనే సభ విజయవంతం చేయటానికి బీఆర్ఎస్ ఇంతగా కష్టపడుతోంది. జీవన్ రెడ్డి పార్టీలో చేరిక+కేసీఆర్ హాజరవబోతున్న ఈ సభ ఫెయిలైందంటే అది జీవన్ కే కాకుండా కేసీఆర్ కు కూడా అవమానమే. అందుకనే జనసమీకరణ కోసం కేటీఆర్ బాధ్యతలు ఇంతమందికి అప్పగించింది. దీంతోనే జీవన్ మీద మాత్రమే ఆధారపడి సభను విజయవంతం చేయలేమన్న విషయం కేటీఆర్ కు అర్ధమైపోయింది.
జీవన్ తనసత్తా చూపించాలని అనుకుంటే సభకు జగిత్యాల నుండే ఎక్కువమందిని తీసుకురావాల్సుంటుంది. కాని జగిత్యాలలో జీవన్ తిరుగులేని నేతేమీకాదు. నియోజకవర్గంలో జీవన్ కు మద్దతుదారులు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకులు కూడా అంతే ఉన్నారు. ప్రస్తుతం ఉత్తరతెలంగాణలో పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్, కొమురంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో పార్టీ గెలుచుకున్న సీట్లు తొమ్మిది మాత్రమే. మొత్తం 54 సీట్లకు గాను పార్టీ చేతి గెలిచింది 9 అయినా ఇపుడు అన్నీలేవు. ఎందుకంటే జగిత్యాల ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ కుమార్, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. పార్టీ ఉత్తరతెలంగాణలో ఇబ్బందులు పడుతున్న సమయంలో భారీబహిరంగసభ నిర్వహించటం, విజయవంతం చేయటం అంటే మామూలు విషయంకాదు. ఇదే ఉత్తరతెలంగాణలో 2018లో సుమారు 40 నియోజకవర్గాల్లో గెలిచింది. ఈ లెక్కలను గమనిస్తే పార్టీ గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోందన్న విషయం అర్ధమైపోతోంది.
అందుకనే జీవన్ రెడ్డి చేరిక రూపంలో పెద్ద బహిరంగసభ నిర్వహించి పార్టీసత్తాను చాటి నేతల్లో జోష్ నింపాలన్నది కేటీఆర్ ప్లాన్. కేసీఆర్ కూడా చాలాకాలం తర్వాత జనాల్లోకి వస్తున్నారు. అప్పుడెప్పుడే హనుమకొండ జిల్లాలో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన బహిరంసభలో కేసీఆర్ పాల్గొన్నారంతే. మళ్ళీ ఇంతకాలానికి కేసీఆర్ జనాల్లోకి వస్తున్నారు. ఇప్పటికైతే పార్టీలో స్తబ్దత ఆవరించుంది. కేటీఆర్ ఎంతసేపు సోషల్ మీడియాలో మాత్రమే కనబడుతున్నారు. హరీష్ మీడియా సమావేశాలు పెడుతున్నా రేవంత్ టార్గెట్ గా చేస్తున్న ఆరోపణలకు జనాలు పెద్దగా విలువ ఇవ్వటంలేదు. అందుకనే 20వతేదీ బహిరంబసభ సక్సెస్ ను కేటీఆర్ చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

