x

కేటీఆర్ ఫెయిలయ్యారా ? (వీడియో)

ఎన్ని శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేశాము అని చెప్పుకోవటంలో ఫెయిలయ్యారు.


యువ సంగ్రామ సదస్సు నిర్వహణలో కేటీఆర్ ఫెయిలయ్యారనే అభిప్రాయం పెరిగిపోతోంది. శనివారం హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత టార్గెట్ గా యువ సంగ్రామ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఆ సదస్సు నిర్వహణే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం, విమర్శలతో చెలరేగిపోవటం అన్న విషయాన్ని అందరు ఊహించిందే. అనుకున్నట్లే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వంపై రెచ్చిపోయారు. అయితే ఇక్కడే కేటీఆర్ ఫెయిలయ్యారు అనే అంశంపై చర్చలు పెరిగిపోతున్నాయి.

ఏ విషయంలో కేటీఆర్ ఫెయిలయ్యారంటే తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్ని నోటిఫికేషన్లు జారీచేసింది ? ఎన్నిఉద్యోగాలు ఇచ్చింది ? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాయి ? ఎన్ని శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేశాము అని చెప్పుకోవటంలో ఫెయిలయ్యారు. తమ హయాంలో జరిగిన ఉద్యోగాల భర్తీపై స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే తమ తొమ్మిదిన్నరేళ్ళ హయాంలో అంతా గందరగోళం కాబట్టే.

చెప్పుకోవటానికి బీఆర్ఎస్ హయాంలో 16 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అయితే చాలా నోటిఫికేషన్లు లోపాలతోనే జారీ అయ్యాయి. దాంతో నిరుద్యోగలు ఆందోళనలు చేయటం, కోర్టులో కేసులు వేయటం, కోర్టు నోటిఫికేషన్లపై స్టే ఇవ్వటమో లేకపోతే రద్దుచేయటమో చేశాయి. మరికొన్ని నోటిఫికేషన్లు సక్రమంగానే జారీ అయినా గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో గందరగోళం జరిగాయి. ప్రశ్నపత్రాల లీకేజీలు, జవాబు పత్రాల మూల్యాంకలనంలో తప్పులు బయటపడటం, మళ్ళీ నిరుద్యోగుల ఆందోళనలు, కోర్టులో కేసులు వేయటాలు, కోర్టులు స్టే ఇవ్వటం లేదా జరిగిన పరీక్షలను రద్దుచేయటం, ప్రభుత్వం విచారణలు చేయించటంతోనే పుణ్యకాలం గడిచిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఉద్యోగాల భర్తీ విషయంలో తమ హయాంలో అన్ని లోపాలు జరిగితే ఆ విషయాలను మరచిపోయిన కేటీఆర్ ఇపుడు రేవంత్ ప్రభుత్వం మీద బురదచల్లుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న రేవంత్ మాట తప్పిన మాట వాస్తవమే. నిరుద్యోగుల కోణంలో చూస్తే అప్పుడు బీఆర్ఎస్ హయాంలోను ఇపుడు కాంగ్రెస్ హయాంలో కూడా అన్యాయమే జరిగింది, జరుగుతోంది అనే భావనతో ఉన్నట్లు అర్ధమవుతోంది. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీలో ఇప్పటివరకు రేవంత్ ప్రభుత్వంలో లోపాలు జరగలేదన్నది వాస్తవం. మిగిలిన రెండున్నరేళ్ళల్లో అయినా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వేగవంతంగా చర్యలు తీసుకుంటుందా ?

Read More
Next Story