x

బీసీలకు రాజ్యాధికారం పగటికలే

జనాభాలో సగానికి పైగా ఉన్నా ఓటర్లలో కూడా సగానికన్నా ఎక్కువగా ఉన్నా బీసీల్లోని అనైక్యతే ప్రధాన లోపం.


బీసీల్లో ఐకమత్యం వచ్చేవరకు రాజ్యాధికారం పగటికలగానే మిగిలిపోతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేశు అన్నారు. జనాభాలో సగానికి పైగా ఉన్నా ఓటర్లలో కూడా సగానికన్నా ఎక్కువగా ఉన్నా బీసీల్లోని అనైక్యతే ప్రధాన లోపం.

బీసీల్లోని సుమారు 140 ఉపకులాల్లోని 5 ఆధిపత్య ఉపకులాల నేతల మధ్యే రాజ్యాధికారం విషయంలో ఐకమత్యం లేదు.

బీసీల్లో లెక్కకుమిక్కిలి ఉపకులాలుండటం అందులో 5 ఉపకులాల మధ్య ఆధిపత్య పోరాటమే బీసీలకు రాజ్యాధికారం దక్కకపోవటానికి పెద్ద మైనస్ గా మారింది. ఐదు ఉపకులాల నేతలను ఏకతాటిపైకి తీసుకురావటం అన్నది పిల్లిమెడలో గంట కట్టడం లాంటిదే అన్నారు. అగ్రవర్ణాల పార్టీల్లో పనిచేయటానికి బీసీల నేతలు సిద్ధంగా ఉన్నారు కాని తాము ఏకతాటిపైకి రావటానికి మాత్రం సిద్దంగా లేకపోవటం అతిపెద్ద లోపం.

బీసీల నేతలు తమలోని లోపాలను సరిచేసుకుని, త్యాగాలకు సిద్ధపడినపుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారం గురించి ఆలోచించే అవకాశం దక్కుతుంది. లోపాలను సరిచేసుకోవటానికి సిద్ధపడనంత వరకు బీసీలకు రాజ్యాధికారం ఎప్పటికీ సాధ్యంకాదు

Read More
Next Story