కవిత కొత్తపార్టీ పేరు ఇదేనా ?
x
Kalvakuntla Kavitha

కవిత కొత్తపార్టీ పేరు ఇదేనా ?

ఎన్నికల కమిషన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే పార్టీ పేరును కవిత ప్రకటించేందుకు రెడీగా ఉన్నారు


తెలంగాణలో మరో కొత్తపార్టీ తొందరలో రాబోతోంది. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఏర్పాటు అవబోతున్న పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి’ (Jagruthi)అని పేరు పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇదే పేరుతో రాజకీయపార్టీని రిజిస్టర్ చేయటానికి అవసరమైన ప్రక్రియను కవిత(Kavitha) పూర్తిచేసినట్లు తెలిసింది. పార్టీ రిజిస్ట్రేషన్ కు అవసరమైన అన్నీ డాక్యుమెంట్లను తన లాయర్ల ద్వారా కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు జాగృతివర్గాలు చెప్పాయి. ఎన్నికల కమిషన్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే పార్టీ పేరును కవిత ప్రకటించేందుకు రెడీగా ఉన్నారు.

తన పార్టీ పేరులో ‘తెలంగాణ’ అన్నపదం ఉండేట్లుగా కవిత జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మరో పదం జాగృతిని కూడా కలిపారు. జాగృతి అనే పదాన్ని ఎందుకు కలిపారంటే సంవత్సరాల తరబడి కవిత తన కార్యక్రమాలను జాగృతి వేదిక ద్వారానే నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కవితకు జాగృతే కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే పార్టీలో ప్రజా పేరు ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజల ఆశీర్వాదం లేనిదే రాజకీయ నేతలకు, పార్టీలకు ఒక్క అడుగు కూడా ముందుకుపడదన్న విషయం తెలిసిందే.

అందుకనే తన పార్టీ పేరులో తెలంగాణ-ప్రజా-జాగృతి మూడుపదాలను కూర్చి కొత్తగా తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖాయంచేసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మంచి ముహూర్తం చూసుకుని పార్టీ పేరును కవిత ప్రకటించబోతున్నారు.

పార్టీ పేరు ఇంకా అధికారికంగా ఖాయంకాలేదు కాబట్టి ఇపుడు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ పొత్తులో జాగృతి అభ్యర్ధులు పోటీచేయబోతున్నారు. పార్వార్డ్ బ్లాక్ పార్టీగుర్తు ‘సింహం’ చిహ్నమే జాగృతి అభ్యర్ధులు కూడా ఉపయోగించుకోబోతున్నారు. దాదాపు రెండునెలలుగా జనంబాట పేరుతో కవిత రాష్ట్రంలోని పలుజిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నారు. దాని ఇంపాక్ట్ ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు కవిత ఒక ట్రయల్ గా ఉపయోగించుకుంటారు అని అర్ధమవుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story