జీవన్ రెడ్డిది ఐరెన్ లెగ్గేనా ?
x

జీవన్ రెడ్డిది ఐరెన్ లెగ్గేనా ?

తెలంగాణను వ్యతిరేకించిన జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎలా చేర్చుకుంటుందన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.


మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. జీవన్‌ది ఐరెన్ లెగ్ అన్నారు. ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ అధఃపాతాళానికి వెళ్తుందని విమర్శించారు. అందుకే జీవన్ రెడ్డి చేరికను బీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వారిలో హరీష్ రావు కూడా ఉన్నారని, అందుకే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. జగిత్యాలలో సభ పెడుతున్నా హరీష్ మాత్రం ఢిల్లీకి వెళ్లారని అన్నారు. జీవన్ రెడ్డి చేరకముందే బీఆర్ఎస్‌లో ముసలం పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు ఇక్కడ సభ జరుగుతుంటే హరీష్ సహా పలువురు నేతలు ఢిల్లీకి వెళ్లడమే నిదర్శనమని అన్నారు.

ఒకానొక సమయంలో కాళేశ్వరం కట్టినందుకు హరీష్ రావు, కేసీఆర్‌ను ఉరితీయాలని అన్న వ్యక్తి జీవన్ రెడ్డి అని గుర్తు చేశారు. అంతేకాకుండా తెలంగాణను వ్యతిరేకించిన నేత జీవన్ రెడ్డి కాదా? అని సంజయ్ ప్రశ్నించారు. అలాంటి నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధమవడం, ఆయనను పార్టీ స్వాగతించడం వల్ల పార్టీలో వర్గాలు ఏర్పడనున్నాయని జోస్యం చెప్పారు. ఇప్పటికే ఆ వాతావరణం నెలకొందని, అందులో భాగంగానే చాలామంది నాయకులు జీవన్ రెడ్డి చేరికకు వ్యతిరేకంగా హరీష్ రావుతో భేటీ అయ్యారని సంజయ్ వ్యాఖ్యానించారు.

జీవన్ రెడ్డి చేరికకు వ్యతిరేకంగా ఏర్పడిన బీఆర్ఎస్ ఫ్యాక్షన్‌లో చాలా మంది నాయకులు బీజేపీతో మంతనాలు చేస్తున్నారని, సమయం చూసుకుని వారి మాట వినడం లేదని నిశ్చయించుకున్నాక వారు పార్టీ మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని సంజయ్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఐరన్ లెగ్ అని అతిత్వరలో బీఆర్ఎస్‌లో వచ్చే పరిణామాలతో తేటతెల్లం అవుతుందని ఎద్దేవా చేశారు.

Read More
Next Story