కవిత నెక్స్ట్ టార్గెట్ పార్టీని పాపులర్ చేయడమేనా..?
x

కవిత నెక్స్ట్ టార్గెట్ పార్టీని పాపులర్ చేయడమేనా..?

టీఆర్ఎస్ భావజాలాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు నెల రోజుల జెండా పండుగ నిర్వహించాలని కవిత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీను స్థాపించిన కవిత తనక్షణ కర్తవ్యం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమేనా? అంటే అవున్న సమాధానాలే వినిపిస్తున్నాయి. కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కూడా దానినే సూచిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టిన కవిత.. అటువైపు కవర్ చేసేశారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టిసారించారు. అందులో భాగంగానే రానున్న నెల రోజుల పాటు రాష్ట్రమంతా తెలంగాణ రక్షణ సేన జెండా ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంటే ప్రతి నియోజకవర్గంలో తన పార్టీ జెండాలను పెట్టాలి. దీనిని బట్టి చూస్తుంటే పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కవిత తదుపరి కర్తవ్యంగా కనిపిస్తోంది.

పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈనెల 20 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ’ నిర్వహించాలని కవిత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి వరకు పార్టీ జెండాలు ఎగురవేయాలని సూచించారు. పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని ఆమె ఆదేశించారు. తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్రం ఇంకా వంచన ఎదుర్కొంటోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

వలస పాలన నాటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ఆశించిన ప్రజల్లో ఇప్పుడు నిరాశ పెరిగిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని కవిత అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే పార్టీ జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

పార్టీ ఆవిర్భావానికి ముందే చేరిన నాయకత్వంతో పాటు తెలంగాణ జాగృతి నేతలు కూడా సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంతో పార్టీని ప్రజల్లో మరింత బలపర్చే ప్రయత్నం జరుగుతోందనే చర్చ సాగుతోంది.

Read More
Next Story