తెలంగాణలో కవిత TRS ఆవిర్భావం
x

తెలంగాణలో కవిత TRS ఆవిర్భావం

అయితే అది తెలంగాణ రాష్ట్ర సేన. తెలంగాణ జాగృతి నుంచి తెలంగాణ రాష్ట్ర సేన వైపు కవిత పయనం


బీఆర్ఎస్‌కు కల్వకుంట్ల కవిత భారీ షాక్ ఇచ్చారు. శనివారం తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించినా ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ఎస్) తన పార్టీ పేరని అధికారికంగా పార్టీ ప్రారంభ వేడుకలో ప్రకటించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో జరిగిన సభలో టీఆర్‌ఎస్ పేరుతో పార్టీ ఆవిర్భావాన్ని వెల్లడించారు. భారీ జనసందోహం మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర సేన జెండా ఆవిష్కరణ కూడా జరిగింది. జెండా మధ్యలో నీలిరంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ TRS అనే అక్షరాలు ఉంటాయి. ఇలా ఈ విధంగా కవిత టిఆర్ ఎస్ ను కెసిఆర్ మళ్లీ ఉపయోగించుకోకుండా కవిత దెబ్బతీసింది.

శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గన్ పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి మునీరాబాద్‌లోని సభా వేదికకు చేరుకున్నారు. మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సభకు కవిత అనుచరులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభా ప్రాంగణం ఓఆర్ఆర్ పరిసరాల్లో కోలాహలంగా మారింది.

సభలో కవిత తన కొత్త రాజకీయ పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా ప్రకటించారు. వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె అనుచరులు నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. సభ ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కవిత నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రముఖులకు గౌరవం తెలిపిన తర్వాత సభలో పాల్గొన్నారు.

Read More
Next Story