రెండేళ్ళు చాలా కీలకం అన్న కేసీఆర్
x

రెండేళ్ళు చాలా కీలకం అన్న కేసీఆర్

రెండేళ్ళు నియోజకవర్గాల్లో ఉంటు ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని పిలుపిచ్చారు


రాబోయే రెండేళ్ళు బీఆర్ఎస్ కు చాలా కీలకం అని పార్టీ అధినేత కేసీఆర్ నేతలు, ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. రెండేళ్ళు నియోజకవర్గాల్లో ఉంటు ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని పిలుపిచ్చారు. మంగళవారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం మొదలైన ఈ భేటీ రాత్రి పొద్దుపోయేంతవరకు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతు పార్టీ అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించిన వారికి కాకుండా ఏ పదవులు పొందని వారికి పార్టీ పదవుల్లో ప్రయారిటి ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి నియోజకవర్గంలోను సమస్యలను హైలైట్ చేస్తు ప్రజల తరపున పోరాటాలు చేయాలన్నారు.

ప్రతిజిల్లాలోను పార్టీకి సంబంధించిన సమస్యలను గుర్తించి సర్దుబాటు చేయబోతున్నట్లు తెలిపారు. నేతల మధ్య ఉన్న బేదాభిప్రాయాలను పక్కనపెట్టి పార్టీ భవిష్యత్తు కోసం ఏకతాటిపైకి వచ్చి పనిచేయాలన్నారు. తాను ఇకనుండి రెగ్యులర్ గా పార్టీ నేతలతో టచ్ లో ఉంటానని హామీ ఇచ్చారు. కష్టపడి పనిచేయాలని, పార్టీ సభ్యత్వ నమోదు కోసం నేతలంతా కష్టపడి పనిచేయాలని సూచించారు.

Read More
Next Story