x

తప్పుచేసిన కొండా సుస్మిత మీద యాక్షన్ తీసుకోవాలి

తప్పుచేసిన కొండా సుస్మిత పటేల్ పై యాక్షన్ తీసుకోవాల్సిన ప్రభుత్వం కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవటాన్ని జస్టస్ తప్పుపట్టారు


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన కొండా సురేఖ ఎపిసోడ్ పై జస్టిస్ బీ చంద్రకుమార్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. తప్పుచేసిన కొండా సుస్మిత పటేల్ పై యాక్షన్ తీసుకోవాల్సిన ప్రభుత్వం కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవటాన్ని జస్టస్ తప్పుపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎవరైతే నోటికొచ్చినట్లు మాట్లాడారో వారిపైన ప్రభుత్వం యాక్షన్ తీసుకోకుండా సంబంధంలేని తల్లి కొండాసురేఖను మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయటం ఏమి న్యాయం అని ప్రశ్నించారు.

వివిధ సందర్భాల్లో కోడినో లేకపోతే మేకనో బలిస్తారు కాని పులినో, సింహాన్నో బలి ఇవ్వరుగా అని జస్టిస్ కామెంట్ చేశారు. కొండా సురేఖ కూతురుకు మాట్లాడే స్వేచ్చ కూడా లేదా అని జస్టిస్ కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. సీఎంను సుస్మితాపటేల్ నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించినపుడు తప్పుచేసిన వాళ్ళమీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చని స్పష్టంచేశారు.

కూతురు మాట్లాడిన మాటలకు తల్లిని బాధ్యురాలిని చేసి మంత్రివర్గంలో నుండి బర్తరఫ్ చేయటం తీవ్రమైన అన్యాయం అన్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నిసార్లు మాట్లాడినా పార్టీ నాయకత్వం ఎందుకు వాళ్ళపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో బలహీనులకు ఒక న్యాయం బలవంతులకు మరో న్యాయం అమలవుతుందా ? అని ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు.

Read More
Next Story