
కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగించాలా ? (వీడియో)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ప్రభుత్వాన్ని విచిత్రమైన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ప్రభుత్వాన్ని విచిత్రమైన డిమాండ్ చేశారు. అదేమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టును వారంరోజులు కేసీఆర్ కు అప్పగించాలట. ఎందుకంటే ప్రాజెక్టునుండి వృధాగా పోతున్న లక్ష క్యూసెక్కుల నీటిని రైతులకు ఎలాగ అందించాలో చెబుతారని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ ను ఆదివారం మధ్యాహ్నం వందలాది మంది నేతలతో కేటీఆర్ సందర్శించారు. వృధాగా పోతున్న నీటిని నేతలకు, మీడియాకు కూడా చూపించారు.
ఆ తర్వాత మాట్లాడుతు నీటిని రైతులకు అందించకపోవటం వెనుక రేవంత్ కుట్ర ఉందన్నారు. ఇంతకీ కుట్ర ఏమిటంటే ఇపుడు నీరిస్తే పటంల కోసం ఎరువులు అందించాలి తర్వాత పంటలను కొనాలి ఆ తర్వాత పంటలకు మద్దతు దర చెల్లించాలి. అందుకనే ఇవన్నీ చేయటం చేతకాని రేవంత్ నీటిని వృధాగా పోనిస్తున్నారు అన్నది కేటీఆర్ ఆరోపణ.
ఇదే విషయమై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బదులిస్తు అసలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకూ పనికిరాకుండా చేసిందే కేసీఆర్ అని ఎద్దేవాచేశారు. ప్రాజెక్టును పనికిరాకుండా చేసిన కేసీఆర్ కు ప్రాజెక్టును అప్పగిస్తే ఏమిచేయగలరు ? అని మంత్రి ఎదురు ప్రశ్నించారు. ప్రాజెక్టునుండి నీరు వృధాగా పోతోందంటే అందుకు కారణమే కేసీఆర్ అన్నారు. పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేసి నీటిని అందించకపోతే తామే 60 వేలమందితో ముట్టడించి పంప్ హౌస్ లను ఆన్ చేస్తామన్న కేటీఆర్ వార్నింగుకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

