నేతల ఆశలపై నీళ్ళు
x

నేతల ఆశలపై నీళ్ళు

పార్లమెంటులో బిల్లుపై చర్చ, ఓటింగ్ జరగటం, భారీ మెజారిటితో నెగ్గటం ఇక లాంఛనమే అని అందరు అనుకున్నారు


చాలామంది నేతల ఆశలపై పార్లమెంట్ శుక్రవారం నీళ్ళు చల్లింది. నేతల ఆశలపై పార్లమెంటు నీళ్ళు చల్లటం ఏమిటని అనుకుంటున్నారా ? 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై గురు, శుక్రవారాల్లో సుదీర్ఘమైన చర్చ జరిగింది. చివరకు శుక్రవారం రాత్రి 7గంటల ప్రాంతంలో రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. అంటే లోక్‌సభలో జరిగిన ఓటింగులో ఎన్డీయే ఓడిపోయింది. దాంతో మిగిలిన రెండుబిల్లులు నియోజకవర్గాల పునర్విభజనకు ఉద్దేశించిన డీలిమిటేషన్, జమిలి ఎన్నికల బిల్లులను అధికారపక్షమే ఉపసంహరించుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు వీడిపోయింది కాబట్టి రాబోయేఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలుకావన్నది వాస్తవం. ఎప్పటినుండి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయన్నది గాలిలో దీపంలాగ తయారైంది.

ఈ నేపధ్యంలోనే తెలంగాణలోని అనేకమంది నేతల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. ఎలాగంటే రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు పెరుగుతాయని అందరు అనుకుంటున్నదే. పెరగబోయే సీట్లన్నీ మహిళలకే రిజర్వ్ అవుతాయని ప్రచారంజరిగింది. పార్లమెంటులో సుమారుగా 9 సీట్లు, అసెంబ్లీలో అయితే సుమారుగా 60 సీట్లు పెరుగుతాయని అంచనా వేసుకున్నారు. దాంతో పెరగబోయే సీట్లన్నింటిలోను తమ వారసులనే రంగంలోకి దింపాలని చాలామంది నేతలు ప్లాన్ చేసుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య, డిప్యుటి సీఎం మల్లు భట్టి విక్రమార్క భార్య అనిత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భార్య నిర్మల, మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి భార్య, హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి భార్య, హరీష్ రావు భార్య, మేడ్చల్ ఎంఎల్ఏ చేమకూరు మల్లారెడ్డి కూతురు, కోడలు ఇలా అన్నీ పార్టీల్లోని చాలామంది నేతల భార్యలు, కూతుర్లు, కోడళ్ళు పోటీకి రెడీ అవుతున్నట్లు విపరీతంగా ప్రచారం జరిగింది.

పెరగబోయే 26 పార్లమెంటు సీట్లు, 179 లేదా 183 అసెంబ్లీ సీట్లలో ఏనియోజకవర్గం మహిళలకు రిజర్వు అవుతుందన్న విషయంలో ఎవరికీ క్లారిటీలేదు. అయితే మొత్తంమీద 9 పార్లమెంటు, 60 అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ కావటం ఖాయం అన్న ఉద్దేశ్యంతో పోటీకి ఇంట్లోని ఆడవాళ్ళని వారసులుగా చాలామంది నేతలు పోటీకి రెడీ చేస్తున్నారనే ప్రచారం విపరీతంగా జరిగింది. పార్లమెంటులో బిల్లుపై చర్చ, ఓటింగ్ జరగటం, భారీ మెజారిటితో నెగ్గటం ఇక లాంఛనమే అని అందరు అనుకున్నారు. తీరాచూస్తే లోక్ సభ ఓటింగ్ లో మద్దతు లేకపోవటంతో బిల్లు వీగిపోయింది. దీంతో చాలామంది నేతల ఆశలపై పార్లమెంట్ నీళ్ళు చల్లినట్లయ్యింది.

Read More
Next Story