హైదరాబాద్ లో మోదీ సుడిగాలి పర్యటన
x

హైదరాబాద్ లో మోదీ సుడిగాలి పర్యటన

బెంగుళూరులో బయలుదేరి 2.20 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు


ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ లో సుడిగాలి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 10వ తేదీన మోదీ హైదరాబాద్ కు వస్తున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు బెంగుళూరులో బయలుదేరి 2.20 గంటలకు హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుండి నేరుగా హైటెక్ సిటీకి వెళతారు. హైటెక్స్ లో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులతో పాటు భూమిపూజల వర్చువల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వరంగల్ జిల్లాలోని మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రారంభోత్సవం, చేనేత క్లస్టర్ ఏర్పాటు, గిరిజ యూనివర్సిటిలో పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్ని కార్యక్రమాల్లో హైటెక్స్ నుండే వర్చువల్ గా పాల్గొంటారు. ఒకవేళ హైటెక్స్ లో వర్చువల్ ప్రారంభోత్సవాలు, భూమిపూజలకు ఏదైనా సమస్యలు ఎదురైతే వాటిని బేగంపేట్ విమానాశ్రయంలోనే చేసేట్లుగా ప్లాన్ బీ ఏర్పాట్లు కూడా జరిగాయి.

హైటెక్స్ సిటీలో ఒక ఆసుపత్రిని ప్రారంభించి వైద్య నిపుణులతో మాట్లాడుతారు. అక్కడినుండి మళ్ళీ బేగంపేట్ విమానాశ్రయానికి సాయంత్రం 4.40 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్లో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు. 5.30 నుండి 6.30 గంటలవరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత అక్కడినుండి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని కేంద్రమంత్రులు, బీజేపీ ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అక్కడి నుండే ప్రత్యేక విమానాంలో గుజరాత్ లోని జామ్ నగర్ కు బయలుదేరుతారు.

Read More
Next Story