కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ ఫైర్.. తెలంగాణ అంతటా నిరసనలు..
x

కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ ఫైర్.. తెలంగాణ అంతటా నిరసనలు..

మహిళా బిల్లుపై వివాదం నేపథ్యంలో నిరసనలకు పిలుపు, సీఎం నివాసం ముట్టడి యత్నం, ముందస్తు చర్యలతో నేతల నిర్బంధం.


తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ తీవ్ర నిరసనలు చేపడుతోంది. తెలంగాణ ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్‌డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీగా నిరసలు జరుగుతున్నాయి. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది. దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని ఎన్‌డీఏ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే తెలంగాణలో ఈ నిరసనల నేపథ్యంలో రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఈ నిరసనల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలని బీజేపీ భావించింది. ఈ విషయం తెలియడంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సీఎం రేవంత్ ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును హౌస్ అరెస్ట్ చేసింది.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు ఎన్డీయే పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర బీజేపీ సీఎం నివాసం ముట్టడికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. ఈరోజు ఉదయం రామచందర్‌రావు ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రాకుండా నిర్బంధించారు. ఇతర బీజేపీ నేతలపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. నిర్బంధంపై రామచందర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మహిళా శక్తికి ద్రోహం చేసిందని, ఆ పార్టీని వదిలిపెట్టబోమని హెచ్చరించినట్లు తెలిపారు. నిరసనలు కొనసాగుతాయని, పార్టీ శ్రేణులు సీఎం ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నిస్తాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. దేశంలో రాచరిక పాలన కోరుకుంటోందని ఆరోపించారు. ఒక వర్గానికి మేలు చేసేందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్‌సభలో మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపిస్తూ ఈ నిరసనలకు పిలుపునిచ్చినట్లు బీజేపీ తెలిపింది. ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి, నిరసనలు, పోలీసు చర్యలు, ఆరోపణల మధ్య ఈ అంశం మరింత చర్చనీయాంశంగా మారింది.

Read More
Next Story