
కలిసికట్టుగా ‘సర్’ను ఎదుర్కోవాలన్న రేవంత్
శుక్రవారం హైదరాబాద్ హౌజ్ హౌస్ దగ్గర యాత్రీకుల బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు.
ఇతర రాష్ట్రాల్లో జరిగినట్లుగా తెలంగాణలో సర్ పేరుతో ఓట్లు తొలగించటాన్ని ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ హౌజ్ హౌస్ దగ్గర యాత్రీకుల బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు సంక్షేమ పథకాల్లో మైనారిటీలకు తమ ప్రభుత్వం న్యాయబద్దమైన వాటాను అందిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది హజ్ యాత్రకు వెళ్ళిన 44 మంది రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తలా రు. 5 లక్షలిచ్చి ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఉద్యోగాల్లో, సంక్షేపథకాల అమలులో మైనారిటీలకు వాటాను అందిస్తున్నట్లు తెలిపారు. విదేశీ విద్యలో కూడా మైనారిటీలకు మెరిట్ స్కాలర్ షిప్పులను అందిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ లో ఆటోలు నడుపుకుంటున్న చాలామంది మైనారిటీ సోదరులను ఆదుకునే ఉద్దేశ్యంతో రెట్రో ఫిట్టింగ్ పద్దతిలో ఈవీ ఆటోలుగా మార్చే పథకాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. హిందు-ముస్లిం అన్న తేడాలు తమ ప్రభుత్వంలో ఎప్పుడూ లేదన్నారు. హిందూ-ముస్లింలు భాయ్ భాయ్ అంటు ఉండాలన్నారు. సర్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో ఓట్లు తొలగించినట్లే ఇక్కడ కూడా తొలగించాలని చూస్తున్నట్లు రేవంత్ ఆరోపించాడు. ఇతర రాష్ట్రాల్లో ఓట్లు తొలగించినట్లుగా తెలంగాణలో చేయనీయకూడదని పిలుపిచ్చారు. ఈ విషయంలో అందరు కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాలన్నారు. అభివృద్ధిలో తెలంగాణను అగ్రస్ధానంలో ఉంచేందుకు అందరు సహకరించాలని రేవంత్ కోరారు.

