జెన్ జి’ ని ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి వ్యూహం
x

'జెన్ జి’ ని ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి వ్యూహం


కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజానామా ప్రకటన తర్వాత పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ గా తీసుకోవాలనే వ్యూహంలో ఉన్నట్లు అర్ధమవుతోంది. జెన్ జీ తరాన్ని ఆకర్షించేందుకు రేవంత్ చేసిన ప్రకటనతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. చట్టసభల్లో జెన్ జీ ప్రాతినిధ్యం కోసం పోటీచేసే వయసును 21 ఏళ్ళకు తగ్గించేలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రయత్నిస్తుందని రేవంత్ చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. అలాగే జెన్ జీ యువత విద్యా, ఐటి శాఖల మంత్రులుగా ఉంటే దేశం ముందుకు పోతుందని అన్నారు. ఇప్పుడు లోక్ సభ, అసెంబ్లీలకు పోటీచేయాలంటే 25 ఏళ్ళు నిండాల్సిందే అన్న విషయం తెలిసిందే. ఐఏఎస్, ఐపిఎస్ సర్వీసులకు 21 ఏళ్ళకే ఎంపికవుతుంటే చట్టసభలకు కూడా ఇదే వయసును ఎందుకు వర్తింపచేయకూడదు ? అని రేవంత్ ప్రశ్నించారు.


నీట్ పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీ తర్వాత జరిగిన పరిణామాల్లో జెన్ జీ నిర్వహించిన ఆందోళనలు, ఉద్యమాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఎక్కువగా సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతుంది అనుకునే జెన్ జీ అవసరమైతే రోడ్లమీదకు కూడా వస్తామని నిరూపించింది. ఇదే విషయాన్ని రేవంత్ ప్రస్తావిస్తు చట్టసభల్లో జెన్ జీ ప్రాతినిధ్యం గురించి రేవంత్ కొత్త వ్యూహాన్ని అందుకోవటంపై చర్చ మొదలైంది.

అయితే రేవంత్ డిమాండ్ ఆచరణలో ఎంతవరకూ సాధ్యం ?ఎన్నికల్లో గెలవాలంటే ఉండే కుల సమీకరణలు, రాజకీయ వ్యూహల విషయంలో యువత అనుభవం సరిపోతుందా ?దీని మీద పొలిటికల్ పాయింట్ లో చర్చ.

Read More
Next Story