x

అక్రమార్కులకు మద్దతుగా సెక్రటేరియట్

ఏసీబీ దాడుల్లో అక్రమాస్తుల సంపాదనలో పట్టుబడ్డవారు సెక్రటేరియట్ వ్యవస్ధలోని లోపాల కారణంగా బయటపడిపోతున్నారు.


అవినీతిపరులకు, అక్రమార్కులకు సెక్రటేరియట్టే మద్దతుగా నిలుస్తోంది. సెక్రటేరియట్ వ్యవస్ధ మద్దతు కారణంగానే అవినీతిపరులు రెచ్చిపోతున్నారు అనటంలో సందేహంలేదు. ఏసీబీ దాడుల్లో అక్రమాస్తుల సంపాదనలో పట్టుబడ్డవారు సెక్రటేరియట్ వ్యవస్ధలోని లోపాల కారణంగా బయటపడిపోతున్నారు.

అక్రమాస్తుల ఆరోపణలతో అరెస్టయిన వారిని విచారించి ఏసీబీ డైరెక్టర జనరల్, విజిలెన్స్ కమిషనర్ సిఫారసులతో ప్రాసిక్యూట్ చేసేట్లుగా నిబంధనలు మార్చాలి. డిపార్ట్ మెంటల్ విచారణ, ట్రైబ్యునల్, అప్పీలేట్ అథారిటి లాంటి వ్యవస్ధలు శుద్ధ దండగ. ఇలాంటి వ్యవస్ధలవల్లే అవినీతిపరులు, అక్రమార్కులు చట్టం నుండి తప్పించుకుంటున్నారు.

అవినీతి కేసుల్లో అరెస్టయినా చివరకు శిక్షలు పడుతుందన్న భయంలేకపోవటంతోనే చాలామంది మళ్ళీ అవినీతి సంపాదనకు సిద్ధపడుతున్నారు.

Read More
Next Story