నిరాహార దీక్ష ప్రారంభించిన వీహెచ్
x
V Hanumantha Rao

నిరాహార దీక్ష ప్రారంభించిన వీహెచ్

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనలో ఓబీసీ కాలమ్ లేదన్న నిరసనతోనే వీహెచ్ దీక్షకు దిగారు.


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ సలహాదారుడు వీ హనుమంతరావు శనివారం ఉదయం ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. పెద్ద అంబర్ పేటలోని తన ఇంట్లోనే వీహెచ్ దీక్షను ప్రారంభించారు. దీక్షను ఇంకెక్కడైనా చేస్తే పోలీసులు భగ్నంచేసే అవకాశం ఉందన్న కారణంగా తన ఇంట్లోనే దీక్ష మొదలుపెట్టారు. ఇంతకీ దీక్షకు కారణం ఏమిటంటే కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనలో ఓబీసీ కాలమ్ లేదన్న నిరసనతోనే వీహెచ్ దీక్షకు దిగారు. జనగణలోనే కులగణన చేయాలని, అందులో ఓబీసీ కాలమ్ కూడా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాసినా ఉపయోగం కనబడలేదన్న కారణంగానే తాను దీక్ష మొదలుపెట్టినట్లు వీహెచ్ చెప్పారు.

నిజానికి 75 ఏళ్ళకు పైబడిన వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష చేయటం ఆరోగ్యరీత్యా మంచిదికాదని సన్నిహితులు గట్టిగా చెప్పారు. అయినా ఓబీసీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగానే తాను దీక్ష చేస్తున్నట్లు వీహెచ్ ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా చేస్తున్న దీక్షకు అన్నీ పార్టీలు మద్దతుతెలపాలని వీహెచ్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్, ఎంఎల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, ఎంఎల్ఏ, ఓబీసీ కమిటి ఛైర్మన్ శంకరయ్య, కన్వీనర్లు ధనలక్ష్మి, కే వెంకటేష్, సంతోష్, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీక్షను ఇంట్లోనే చేసినా పోలీసులు చూస్తూ ఊరుకుంటారా ? అన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story