సింగరేణిని దేవుడే రక్షించాలా ?  (వీడియో)
x

సింగరేణిని దేవుడే రక్షించాలా ? (వీడియో)

ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన బకాయిలు సుమారు రు. 56 వేల కోట్లకు పెరిగిపోయింది


తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకమైన సింగరేణిని అన్నీ పార్టీలు కలిసి ఆర్ధిక సమస్యల్లోకి నెట్టేశాయి. ప్రస్తుతం సంస్ధకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు సుమారు రు. 56 వేల కోట్లకు పెరిగిపోయింది. ఇన్ని వేలకోట్లరూపాయల బకాయిలను ప్రభుత్వం తీర్చే అవకాశం సమీపభవిష్యత్తులో కనబడటంలేదు. ఎందుకంటే రు. 56 వేల కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం నుండి, విద్యుత్ విభాగాల నుండి సంస్ధకు రావటం జరిగేపనికాదు.

అందుకనే సంస్ధ ఉద్యోగులకు చెల్లించాల్సిన నెలవారీ జీత, బత్యాలకు కూడా యాజమాన్యం ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళాల్సొస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ళల్లో సంస్ధకు సుమారు రు. 20 వేల కోట్ల బకాయిలు పడింది. ఇప్పటి రెండున్నరేళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వేల కోట్లరూపాయలు యాజమాన్యానికి బకాయిలను బకాయిపడింది.

దీంతో సంస్ధ నానాటికి బకాయిల ఊబిలో కూరుకుపోతోందన్నది. సింగరేణి బొగ్గు వాడుకున్నందుకు విద్యుత్ సంస్ధలు జెన్కో, డిస్కమ్ ల నుండే రు. 22 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇలాంటి అనేక సంస్ధల నుండి బకాయిలు పేరుకుపోవటంతో సింగరేణి యాజమాన్యం అప్పుల్లో కూరుకుపోతోంది.

Read More
Next Story