సర్ చట్టబద్ధం కాదు
x

'సర్ చట్టబద్ధం కాదు'


తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న 'సర్' ప్రక్రియ ఓటర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే ఆధార్, పాస్‌పోర్ట్ లేదా ఓటర్ ఐడీ వంటి అధికారిక కార్డులు ఉన్నప్పటికీ, అధికారులు పాత కాలపు రికార్డులు అడుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల నాటి పాత వివరాలు, 2002 నాటి నివాస రికార్డులు, కుటుంబ చరిత్రకు సంబంధించిన ఆధారాలను చూపించాలనడం సామాన్యులకు పెద్ద సమస్యగా మారింది. దశాబ్దాల క్రితం నాటి పత్రాలు అందుబాటులో లేకపోవడంతో నిజమైన ఓటర్లు తమ హక్కును నిరూపించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక పౌరుడు తన ప్రాథమిక ఓటు హక్కును నిలబెట్టుకోవడానికి తన కుటుంబ పూర్వీకుల చరిత్రను ఎంతవరకు నిరూపించుకోవాలనే ప్రశ్న బలంగా ఉత్పన్నమవుతోంది.

దీని గురించి 'ఫెడరల్ పొలిటికల్ పాయింట్' లో చర్చ.

‘సర్ ప్రక్రియ తప్పకుండా జరగాలి.కొన్ని లోపాలు ఉన్నంతమాత్రాన ‘సర్’ ప్రక్రియ పట్ల వ్యతిరేకత పెంచుకోకూడదు.’సర్’ లేకపోతే జరిగే నష్టమే ఎక్కువ.’

-కృష్ణారెడ్డి, అసోసియేట్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, హెచ్సియు

‘సర్ ప్రక్రియ చట్టబద్ధం కాదు.అసలు ఇప్పుడు ఎన్నికల అధికారులు అడుగుతున్న ఇన్ని డాక్యుమెంట్స్ అడిగే చట్టబద్దత సర్ కి లేదు.అది ప్రజాస్వామ్యస్పూర్తికి వ్యతిరేకం.’

-వి.ఎస్.ప్రసాద్ శాస్త్రి, రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్

‘సర్ ప్రక్రియ వల్ల లక్షల ఓట్ల తొలగింపు జరుగుతోంది. చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రక్రియను నిర్వహించడం వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ.’

-నరేంద్ర చలసాని,జర్నలిస్ట్

Read More
Next Story