
తండాల్లోనూ SIR టెన్షన్! గిరిజనుల ఓట్లకు ముప్పేంటి?
అసలు ఓటర్లకు సమస్య ఏంటి?
తెలంగాణలో SIR వివాదం మూడు స్థాయిల్లో ఉంది.
1. లక్షలాది ఓటర్ల verification సమస్య,
2. తండాలు Scheduled Areasలో ప్రత్యేక అభ్యంతరాలు,
3. రాజకీయ పార్టీల ఆందోళనలు.
గిరిజన ప్రాంతాల్లో ఓటర్ల నమోదుపై వివాదం!
SIR ఓటర్ల జాబితా సవరణపై తెలంగాణలో మరో వివాదం తెరపైకి వచ్చింది. Fifth Schedule ప్రాంతాల్లో అర్హత లేని non-tribal వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేస్తున్నారంటూ ఆదివాసీ హక్కుల సంఘం Adivasi Sena హైకోర్టును ఆశ్రయించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని స్థానిక రికార్డుల ఆధారంగా ఓటర్లుగా చేర్చుతున్నారన్నది పిటిషనర్ల ఆరోపణ. SIRలో వచ్చిన Enumeration Formsను పూర్తిగా పరిశీలించి, అర్హత లేని నమోదులను తొలగించాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై ఆగస్టు 6న విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి వివరణ కోరింది.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలంలో SIRపై మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని పలు గ్రామాలు.. పరందోలి తండాతో పాటు కొన్ని గ్రామాల్లో SIR ఎన్యూమరేషన్‌ను బహిష్కరించాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఓటర్ల జాబితా మాత్రమే కాదు. 12 గ్రామాల భూములకు సంబంధించి తెలంగాణ–మహారాష్ట్ర మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం కూడా ఉంది. SIR ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకోవడానికి నిరాకరించిన గ్రామస్థులు.. ముందుగా భూ సమస్యను పరిష్కరించాలి, ఆ తర్వాతే SIRకు సహకరిస్తామని స్పష్టం చేశారు.
అసలు ఓటర్లకు సమస్య ఏంటి?
పాత ఓటర్ల జాబితాతో ప్రస్తుత వివరాలు సరిపోకపోవడం, పేరు లేదా తల్లిదండ్రుల పేరు mismatch కావడం, గత SIRతో mapping కాకపోవడం వంటి కారణాలతో కొందరికి notices వచ్చాయి. ఇక్కడే ఓటర్ల ఆందోళన మొదలైంది. “పేరు mismatch లేదా mapping సమస్య వల్ల నిజమైన ఓటు పోతుందా?” అన్నది ప్రశ్నగా మారింది.
మరి ఓటర్లు ఏం చేయాలి?
ఇదే అత్యంత ముఖ్యమైన విషయం. మీ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నోటీసు వచ్చినా, మీ పేరు కనిపించకపోయినా Claims and Objections ప్రక్రియలో అభ్యంతరం నమోదు చేసి, అవసరమైన పత్రాలతో verificationకు హాజరుకావచ్చు.ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం Claims and Objections ప్రక్రియకు అక్టోబర్ 7 వరకు అవకాశం ఉంది. తుది ఓటర్ల జాబితా, verification ప్రక్రియ, ఎన్నికల అధికారుల నిర్ణయమే కీలకం. అందుకే అసలు ప్రశ్న ఒక్కటే. SIR ఓట్లను తొలగిస్తోందా? లేక ఓటర్ల జాబితాను శుద్ధి చేస్తోందా?
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే SIRను ఉపయోగించి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. బ్రిటిష్ కాలంలో 'సైమన్ గో బ్యాక్' నినాదంలాగే, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో 'సర్ గో బ్యాక్' (SIR Go Back) నినాదంతో దేశ ప్రజలంతా ఏకమై ఉద్యమిస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన 'ప్రతిదిన్' మీడియా కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వ్యతిరేకుల ఓట్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
SIRపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ వాదన ఏంటి?బీజేపీ మాత్రం SIR అనేది ఓటర్ల జాబితాను పరిశీలించి, డూప్లికేట్, మృతులు, మారిపోయిన ఓటర్ల ఎంట్రీలను గుర్తించి జాబితాను శుద్ధి చేసే ప్రక్రియ అని చెబుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా SIRను రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియగా పేర్కొంటూ, కాంగ్రెస్ దీనిని రాజకీయంగా తప్పుగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. అసలు SIR లో భాగంగా ఎంతమంది ఓటర్లను పరిశీలించారు? ఎవరి పేర్లకు నోటీసులు వచ్చాయి? చివరికి ఎవరి పేరు ఓటర్ల జాబితాలో ఉంటుంది?
తెలంగాణలో మొత్తం 3.38 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.64 కోట్ల మందికి పైగా Enumeration Forms సమర్పించారు.అదే సమయంలో 73.39 లక్షల మంది ఓటర్లను ASDD కేటగిరీలో గుర్తించారు.అంటే Absent, Shifted, Dead, Duplicate అందుబాటులో లేని, వేరే చోటికి మారిన, మరణించిన లేదా డూప్లికేట్‌గా అనుమానిస్తున్న ఎంట్రీలు.
ఇక Forms సమర్పించిన వారిలో కూడా 92.87 లక్షల మందికి నోటీసులు జారీ అయ్యాయి. పేరు, వయసు, స్పెల్లింగ్‌లో తేడాలు, 2002 జాబితాతో మ్యాపింగ్ కాకపోవడం వంటి కారణాలు ఇందులో ఉన్నాయి.
కానీ ఇక్కడ ఒక కీలక విషయం ఉంది. ASDDలో ఉండటం లేదా నోటీసు రావడం అంటే ఓటు శాశ్వతంగా పోయినట్టు కాదు. వెరిఫికేషన్, Claims and Objections ప్రక్రియ పూర్తయ్యాకే తుది నిర్ణయం ఉంటుంది.
మరి కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది? పెద్ద సంఖ్యలో ఓటర్లను ASDDలో పెట్టడం, లక్షల మందికి నోటీసులు ఇవ్వడం వల్ల genuine voters పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నది కాంగ్రెస్ వాదన. ముఖ్యంగా documentation లేదా mappingలో సమస్య ఉన్నంత మాత్రాన అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించకూడదని కాంగ్రెస్ చెబుతోంది.
అయితే అసలు వివాదం ఎక్కడుంది?
73.39 లక్షల ASDD ఎంట్రీల్లో నిజంగా ఎంతమంది డూప్లికేట్ లేదా డెడ్?
92.87 లక్షల నోటీసుల్లో ఎంతమంది వెరిఫికేషన్ తర్వాత మళ్లీ eligible అవుతారు?
అధికారుల ప్రకారం నోటీసులు అందుకున్న వారిలో సుమారు 38 లక్షల మంది స్పందించగా, వెరిఫికేషన్ తర్వాత వారి పేర్లను తుది జాబితాలో కొనసాగించేందుకు గుర్తించినట్లు సమాచారం.
అయితే ఇంకా పెద్ద సంఖ్యలో కేసుల్లో hearing, verification ప్రక్రియ కొనసాగుతోంది.SIRలో ఇప్పటికే 4.40 లక్షల కొత్త Form-6 దరఖాస్తులు రావడం కూడా మరో కీలక అంశం.ఇక రాజకీయ పార్టీలపై ప్రభావం?
SIRతో ఓటర్ల కూర్పు మారుతోంది. మారుతున్న ఈ లెక్కలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలపై ఎలాంటి ప్రభావం వుంటుంది.

