బీజేపీ 23వ రాష్ట్రంగా తెలంగాణ
x

బీజేపీ 23వ రాష్ట్రంగా తెలంగాణ

బీజేపీ తదుపరి మజిలీ, టార్గెట్ తెలంగాణ అని ప్రజలు అనుకుంటున్నారు


మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేమిటంటే దేశంలో 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని చెప్పిన ఈటల 23వ రాష్ట్రంగా తెలంగాణలో కూడా గెలవబోతోంది అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతు తొందరలోనే జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తున్న సందర్భంగా ఈటల మాట్లాడారు. సికింద్రాబాద్ లో సాయంత్రం 3 గంటలకు జరిగే బహిరంగసభకు తన నియోజకవర్గం నుండే లక్షమంది హాజరవుతారని చెప్పారు.

కార్యకర్తలు, నాయకులు ప్రజల వెంట బహిరంగసభకు రావాలన్నారు. ఎండకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి సికింద్రాబాద్ చేరుకోవటానికి వెయ్యి బస్సులను ఏర్పాటుచేసినట్లు వివరించారు. మోదీ మీద ప్రేమను చూపించటానికి మల్కాజ్ గిరి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు ఈటల తెలిపారు. బీజేపీ తదుపరి మజిలీ, టార్గెట్ తెలంగాణలో విజయమే అని ప్రజలే అనుకుంటున్నట్లు ఎంపీ చెప్పారు. బీఆర్ఎస్ ను వద్దనుకుని కాంగ్రెస్ కు ఓట్లేస్తే రెండేళ్ళల్లోనే తేలిపోయిందని ఎద్దేవా చశారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుని పోకూడంటే, నియంతృత్వ పోకడలు పోవాలంటే బీజేపీని అధికారంలోకి తెచ్చుకోవాలనే భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు.

Read More
Next Story