
పరువు పోగొట్టుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్
ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి సమాధానం ఇవ్వటంతో బండికి బొత్తిగా విషయ పరిజ్ఞానం లేదన్న విషయం బయటపడి పరువు పొగొట్టుకున్నారు
కేంద్రమంత్రిలో ఉండాల్సిన హుందాతనం బండి సంజయ్‌లో మచ్చుకి కూడా కనిపించటంలేదు. ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో విషయంలో తప్పుపట్టడం, బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కుదరకపోతే బీఆర్ఎస్ పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవటమ బండికి తెలిసింది. ఇపుడు విషయం ఏమిటంటే కాంగ్రెస్ రాజకీయ వేదికపై ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనీల్ జైన్ అంటు అధికారులపై విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా జైన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాయటం సంచలనంగా మారింది. తాజా లేఖకు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారి సమాధానం ఇవ్వటంతో బండికి బొత్తిగా విషయ పరిజ్ఞానం లేదన్న విషయం బయటపడి పరువు పొగొట్టుకున్నారు.
విషయం ఏమిటంటే మూడురోజుల క్రితం మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరిశీలించిన విషయం తెలిసిందే. రేవంత్‌తో పాటు ఇరిగేషన్ శాఖమంత్రి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి (NDSA) ఛైర్మన్ అనీల్ జైన్ కూడా కనిపించారు. రేవంత్ తో పాటు అనీల్ జైన్ ను చూడగానే బండికి మండిపోయింది. రేవంత్ తో కలిసి జైన్ మేడిగడ్డ బ్యారేజీని తనిఖీచేయటం ఏమిటంటు మండిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిళ్ళకు లొంగిపోయి ఎన్డీఎస్‌ఏ కమిటీ సిపారసులను నీరుగార్చేట్లుగా జైన్ వ్యవహరిస్తున్నారంటు ఆరోపించారు. అంతటితో ఆగని బండి వెంటనే జైన్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు లేఖ రాశారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన జైన్ తన పర్యటన విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు చెప్పకుండానే ఉంటారా ? జలశక్తి శాఖలో ఎన్డీఎస్ఏ అంతర్భాగం. దేశంలోని ఏ రాష్ట్రంలో ప్రాజెక్టులు, బ్యారేజీలకు సమస్య వచ్చినా చూడాల్సింది ఎన్డీఎస్ఏనే అన్న విషయం బండికి తెలీకపోవచ్చు. ఎన్డీఎస్ఏ అంటే అదేదో బీజేపీకి మాత్రమే పరిమితమైనట్లుగా బండి మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రాజెక్టులు, బ్యారేజీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ? వాటిని నిర్మించింది ఎవరు ? ఏ పార్టీ హయాంలో నిర్మితమయ్యాయి ? అనే విషయాలు ఎన్డీఎస్ఏకు అనవసరం. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు స్ధిరంగా ఎలాగ ఉంటాయో, ప్రభుత్వ శాఖలు కూడా అంతేకదా.
ఏప్రాజెక్టు లేదా బ్యారేజీకి సమస్య వచ్చినా చూడాల్సింది ఎన్డీఎస్ఏలోని నిపుణులే కదా. అందుకనే ఛైర్మన్ అనీల్ జైన్ హైదరాబాద్ వచ్చారు. రేవంత్‌తో కలిసి జైన్ మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లకు చేయాల్సిన మరమత్తులను రేవంత్ తో పాటు జైన్ కూడా దగ్గరుండి మరీ పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో జైన్ ను తప్పుపట్టాల్సిన అవసరం బండికి ఏమొచ్చింది ? అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏముందో అర్ధంకావటంలేదు. రిపేర్లకు ఎన్డీఎస్ఏ చెప్పిన పరిష్కారాలు, సూచనలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందా లేదా చూడటమే జైన్ చేసిన తప్పా ? ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం కాబట్టే జైన్ కూడా పాల్గొన్నారు. ఇందులో రాజకీయం ఏమీలేదు, అభ్యంతరం చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఇదేవిషయమై బండి లేఖలోని అభ్యంతరాలకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇ శ్రీధర్ సమాధానమిచ్చారు. జైన్ పర్యటనలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. అధికారిక పర్యలోనే జైన్ పాల్గొన్నట్లు స్పష్టంగా చెప్పారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులపురోగతిని సమీక్షించేందుకే జైన్ మేడిగడ్డను సందర్శించినట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ సిఫారసుల ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో తెలసుకోవటం సంస్ధ ఛైర్మన్ బాధ్యతగా జైన్ భావించినట్లు శ్రీధర్ వివరించారు. శ్రీధర్ రాసిన లేఖతో బండి పరువంతా పోయినట్లయ్యింది. ఎంతసేపు ఎదుటివాళ్ళను లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని తప్పుపట్టడం కాకుండా కాస్త ఆలోచించి మాట్లాడితే మంత్రిపదవికి హుందాతనం పెంచినట్లవుతుందని బండి ఎప్పటికి తెలుసుకుంటారో ?

