సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: టీవీకే
x

సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: టీవీకే

ద్రవిడ పార్టీలకు 50 ఏళ్ల అనుభవం దోచుకోవడంలోనే ఉందని విమర్శలు


Click the Play button to hear this message in audio format

తమిళనాడులో వెలువడుతున్న అసెంబ్లీ ఫలితాలలో ‘టీవీకే’ పార్టీ దూసుకుపోతోంది. ఎన్నికల సంఘం వెలువరిస్తున్న ఫలితాల ప్రకారం ఆ పార్టీ 113 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటకు 118 స్థానాలు అవసరం. అయితే ఎన్నికల ఫలితాలపై టీవీకే పార్టీ స్పందించింది. తమ పార్టీ సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ప్రాథమిక ఎన్నికల సరళిలో పార్టీ 'ఎత్తుకు ఎగబాకుతున్నట్లు' కనిపిస్తోందని టీవీకే జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ సోమవారం విశ్వాసం వ్యక్తం చేశారు.

పీటీఐ వీడియోస్‌తో మాట్లాడుతూ, ఈ ఫలితాలు ఊహించినవేనని, ద్రవిడ పార్టీలతో విసిగిపోయినందుకే తమిళనాడు ప్రజలు టీవీకేను ఎంచుకున్నారని గెరాల్డ్ పేర్కొన్నారు. "వారికి 50 లేదా 75 ఏళ్ల అనుభవం ఉండొచ్చు, కానీ వారికి రాష్ట్రాన్ని దోచుకోవడంలో మాత్రమే అనుభవం ఉంది" అని గెరాల్డ్ ఎద్దేశా చేశారు. ప్రత్యామ్నాయంగా ఓటర్లు టీవీకేను విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రచార సమయంలో పార్టీ నాయకుడు విజయ్ మీడియాలో పరిమితంగా కనిపించడంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆ నాయకుడు మీడియా ద్వారా కాకుండా "నేరుగా ప్రజలతో మాట్లాడటానికే" ఇష్టపడ్డారని గెరాల్డ్ పేర్కొన్నారు.
పార్టీ ఒక్క సీటు కూడా గెలవడానికి ఇబ్బంది పడుతుందని సూచించిన గత విమర్శలను, మీడియా కథనాలను ఆయన తోసిపుచ్చారు. అధిక ఓటింగ్ శాతమే ప్రజా మద్దతుకు నిదర్శనమని ఆయన ఉదహరించారు. ఎన్నికల ప్రచారంలో టీవీకేను డీఎంకే తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని అన్నారు.
"వారు కళ్ళు మూసుకుని ఒక చీకటి గదిలో పరుగెత్తారు. ఇప్పుడు వారు తాము జీవిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటారు". ట్రెండ్‌లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఎలాంటి ఇతరుల మద్దతు లేకుండానే టీవీకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గెరాల్డ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More
Next Story