కోమటిరెడ్డి మంత్రి పదవికి అడ్డంకి ఎవరో తెలుసా ?
x

కోమటిరెడ్డి మంత్రి పదవికి అడ్డంకి ఎవరో తెలుసా ?

మంత్రి పదవి రాలేదన్న కోపాన్నంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చూపుతున్నాడు


కోమటిరెడ్డి బ్రదర్స్ గా పాపులరైన వారిలో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మునుగోడు ఎంఎల్ఏగా ఉన్నారు. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున కొందరు నేతలు రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చారట. హామీ ఎందుకు ఇచ్చారంటే అప్పట్లో రాజగోపాలరెడ్డి బీజేపీలో ఉండేవారు. బీజేపీని వదిలేసి కాంగ్రెస్‌లో చేరమని అడిగే సమయంలో మంత్రిపదవి కూడా ప్రస్తావనకు వచ్చింది. అందుకనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఇస్తామని వెంకటరెడ్డితో మాట్లాడిన నేతలు హామీ ఇచ్చారు.

అనుకున్నట్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాని రాజగోపాలరెడ్డికి మంత్రిపదవి మాత్రం దక్కలేదు. ఎందుకు రాలేదంటే అన్న వెంకటరెడ్డికి క్యాబినెట్లో చోటు దక్కింది. వెంకటరెడ్డితో పాటు మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా క్యాబినెట్లో చేరారు. మంత్రులు ఇద్దరిదీ ఉమ్మడి నల్గొండ జిల్లానే. ఇద్దరిదీ రెడ్డి సామాజికవర్గమే. అందుకనే రాజగోపాల్‌కు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మంత్రిపదవి దక్కకపోవటానికి అన్న వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నపుడు తమ్ముడు రాజగోపాలరెడ్డిని మళ్ళీ మంత్రిగా తీసుకునే ఛాన్స్‌లేదు. అన్నదమ్ములిద్దరికీ ఏకాలంలో అదికూడా నల్గొండ జిల్లానుండి ముగ్గురూ రెడ్లనే తీసుకోవటం అంటే కష్టమే.

దీనిబట్టి అర్ధం అవుతున్నది ఏమిటంటే తమ్మడు రాజగోపాలరెడ్డికి మంత్రిపదవి రాకపోవటానికి అన్న వెంకటరెడ్డే అసలు కారణమని. ఈవిషయం బహిరంగంగా అంగీకరించలేక, అన్నను మంత్రివర్గంలో నుండి తప్పుకోమని అడగలేక రాజగోపాల్ రెడ్డి నానా అవస్తలు పడుతున్నారు. మంత్రి పదవి రాలేదన్న కోపాన్నంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చూపుతున్నాడు. తాజాగా యాదగిరిగుట్ట దేవాలయం పాలకమండలి నియామకం విషయంలో కూడా రాజగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తంచేశాడు. తనను కనీసమాత్రంగా కూడా సంప్రదించకుండా పాలకమండలిని నియమించటం ఏమిటని మండిపోయాడు. నిజానికి దేవాలయాలకు పాలకమండళ్ళను నియమించేటపుడు ముఖ్యమంత్రి ఎవరినీ సంప్రదించాల్సిన అవసరంలేదు. ఎంఎల్ఏలను సంప్రదించిన తర్వాతే పాలకమండళ్ళను నియమించాలన్నదే కరెక్టయితే రేవంత్ ఇక ముఖ్యమంత్రిగా ఉండటం ఎందుకు ?

స్ధానిక రాజకీయ నేతలను, ప్రజాప్రతినిధులను పాలకమండలికి దూరంగా ఉంచాలని రేవంత్ అనుకున్నట్లున్నాడు. అందుకనే ఏ ఎంఎల్ఏను సంప్రదించకుండా తనంతట తానే రిపోర్టులు తెప్పించుకుని ఛైర్మన్, సభ్యులను నియమించేశాడు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే రేవంత్-రాజగోపాల్ మధ్య మంచి సంబంధాలు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా రేవంత్ ఏమీ రాజగోపాల్ మీద ఆధారపడి రాజకీయాలు చేయటంలేదు. అందుకనే రాజగోపాల్‌ను రేవంత్ ఏమాత్రం లెక్కచేయటంలేదు. బెదిరించి పనులు చేయించుకుందామని రాజగోపాల్ అనుకుంటే రేవంత్ ఏమీ అమాయకుడు కాదు, చేతకాని వాడు అంతకన్నా కాదు. కాబట్టి వాస్తవాలను అర్ధంచేసుకుని వ్యూహాన్ని మార్చుకుంటే రాజగోపాల్‌కే మంచిది. అలాకాకుండా ఇదేపద్దతిలో ఉండాలని అనుకుంటే భవిష్యత్తులో ఏమవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే.

Read More
Next Story