సింగరేణి మద్దతు కోసం అవస్తలు పడుతున్న బీఆర్ఎస్
కోల్పోయిన చోటే ఓట్లను ఏరుకోవాలి అన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ పరిస్ధితి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుండే బీఆర్ఎస్ సింగరేణి(కోల్ బెల్ట్) ఏరియాలపై దృష్టిపెట్టింది. బుధవారం నాడు గోదావరిఖని, సింగరేణి స్టేడియంలో భారీ బహిరంగసభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నేతలు కూడా సభకు హాజరయ్యారు. ఉద్యమకాలంలో కోల్‌బెల్ట్ పై బీఆర్ఎస్‌కు మంచి పట్టుండేది.
అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది ఒక్క నియోజకవర్గంలో మాత్రమే. కోల్‌బెల్ట్‌లోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలతో కలిపి సుమారు 6 లక్షల ఓట్లుంటాయి. అందుకనే ఈ ఏరియాపై పట్టుకోసం అన్నీ పార్టీలు నానా అవస్తలు పడుతున్నాయి. 2018 తర్వాత కోల్‌బెల్ట్ నియోజకవర్గాల్లో కోల్పోయిన పట్టును ఎలాగైనా సాధించాలని ప్లాన్ వేసింది.
టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కూడా పట్టుకోసం కోల్ బెల్ట్ పైన బాగా దృష్టి పెట్టింది. అందుకనే కోల్ బెల్ట్ ఏరియాల్లోని పార్టీ నేతలు, సింగరేణి యూనియన్ నేతలతో తరచూ ప్రత్యేకంగా కేటీఆర్ సమావేశమవుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం బహిరంగసభ నిర్వహిస్తున్నారు. బహిరంగసభలోనే కోల్‌బెల్ట్ ఏరియా విషయంలో పార్టీ ప్రణాళికలను వివరించబోతున్నారు. కేటీఆర్ వ్యూహాలతో సింగరేణి ఏరియాపై బీఆర్ఎస్ మళ్ళీ పట్టు సాధిస్తుందో లేదో చూడాలి.

